కరోనా వైరస్ విజృంభణతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని బారినపడి చైనా తదితర దేశాలతో సహా 200 మందికిపైగా మరణించారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి భీకరంగా ఉన్న చైనాలోని వుహాన్ నగరంలో పరిస్ధితి అత్యంత విషమంగా ఉంది.

Also Read:కరోనా రోగుల శాడిజం... మిగితా వాళ్లకి కూడా వైరస్ సోకాలని.

వైరస్ వ్యాప్తి చెందకుండా చైనా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే నగరంలోని ఓ వీధిలో ఉన్న షాపు ముందు ఓ వ్యక్తి చనిపోయి పడివుండటం కలకలం రేపింది.

అతను కరోనాతోనే మరణించాడని.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అతనిని పలకరించడానికి కానీ.. కనీసం ఎలా ఉన్నాడో చూడటానికి కూడా జనం భయపడుతున్నారంటే కరోనా ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఈ సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్ధితిని పర్యవేక్షించారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సర్జికల్ బ్యాగులో కప్పి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించడంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను శుభ్రం చేయించారు.

Also Reada;కరోనా వైరస్ ఎఫెక్ట్...ఆ బీర్ ముట్టని జనాలు... సేల్స్ ఢమాల్

వుహాన్‌లో కరోనా కారణంగా ఇప్పటి వరకు 159 మంది మరణించినట్లు తెలుస్తోంది. వ్యాధి నిర్థారణా పరీక్షల కోసం ప్రజలు గంటల తరబడి ఆస్పత్రుల ముందు వేచి చూస్తున్నారు. కాగా చనిపోయిన వ్యక్తి ఎవరా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యక్తి కరోనా కారణంగానే చనిపోయడా..? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.