టేకాఫైన కొద్దిసేపటికే నిద్రపోయిన పైలెట్లు:దారితప్పిన విమానం
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇండోనేషియాకు చెందిన బాటిక్ ఫ్లైట్ పైలెట్లు నిద్రపోయారు. అయితే చివరి నిమిషంలో నిద్ర లేవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
జకార్తా: ఇండోనేషియాలోని బాటిక్ విమానానికి చెందిన ఇద్దరు పైలెట్లు నిద్రలోకి జారుకోవడంతో విమానం దారి తప్పింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈ ఏడాది జనవరి మాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అయితే అరగంట తర్వాత నిద్ర నుండి పైలెట్ మేల్కోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయమై దర్యాప్తు జరిపి బాధ్యులైన పైలెట్, కో పైలెట్ పై చర్యలు తీసుకొన్నారు.
also read:మిస్ వరల్డ్ 2024: చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవాకు కిరీటం
పైలెట్లు నిద్ర పోయిన సమయంలో ఈ విమానంలో 153 మంది ప్రయాణీకులున్నారు. సులవేసి నుండి జకార్తాకు ఈ విమానం బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.అయితే ఈ ఘటన జరిగిన ముందు రోజు రాత్రి విధులు నిర్వహించిన పైలెట్ సరైన విశ్రాంతి తీసుకోలేదని సమాచారం.
also read:ఎన్‌డీఏలోకి తెలుగుదేశం: ఆహ్వానించిన బీజేపీ, త్వరలో అధికారిక ప్రకటన
విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత విమాన కెప్టెన్ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి సహచర పైలెట్ అనుమతి కోరాడు. ఇందుకు అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.కో-పైలెట్ ఎయిర్ క్రాఫ్ట్ కమాండ్ అనుమతి తీసుకొని నిద్రపోయాడు.అయితే జకార్తాలోని ఏరియా కంట్రోల్ సెంటర్ విమానాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించింది.అయితే ఇందుకు ఎయిర్ కంట్రోల్ సెంటర్ కు పైలెట్ల నుండి సమాధానం రాలేదు.
28 నిమిషాల తర్వాత పైలెట్ నిద్ర లేచాడు. అయితే అప్పటికే తన సహచర పైలెట్ కూడ నిద్రిస్తున్న విషయాన్ని గుర్తించాడు. అంతేకాదు విమానం సరైన మార్గంలో వెళ్లడం లేదని గమనించాడు.
also read:ప్రపంచంలో పొడవైన సేలా టన్నెల్: ప్రారంభించిన మోడీ
తన సహచరుడిని నిద్రలేపి ఏటీసీ నుండి వచ్చిన కాల్స్ కు స్పందించి విమానాన్ని సరైన మార్గంలోకి నడిపించారు. ఇండోనేషియాకు చెందిన ఏ320 ఎయిర్ బస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు విమాన సిబ్బంది సహా 153 మంది ప్రయాణీకులు కూడ ఇందులో ఉన్నారు.ఈ విమానంలో ప్రయాణించిన వారంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు.
also read:కజిరంగ నేషనల్ పార్క్‌లో కలియదిరిగిన మోడీ: ఏనుగు సవారీ (ఫోటోలు)
ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ బాటిక్ ఎయిర్ వేస్ ను ఈ విషయమై మందలించింది. ఇదిలా ఉంటే తగినంత విశ్రాంతి విధానంతో పనిచేస్తున్నాం, అన్ని భద్రతా సిఫారసులను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని బాటిక్ ఎయిర్ వేస్ సంస్థ శనివారం నాడు ప్రకటించింది.