Asianet News TeluguAsianet News Telugu

ఎన్‌డీఏలోకి తెలుగుదేశం: ఆహ్వానించిన బీజేపీ, త్వరలో అధికారిక ప్రకటన?

ఎన్‌డీఏలోకి తెలుగుదేశం పార్టీని బీజేపీ ఆహ్వానించినట్టుగా ప్రచారం సాగుతుంది.రానున్న ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పనిచేయనున్నాయి.ఈ విషయమై అధికారిక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు.

 BJP, Jana Sena, Chandrababu Naidu's TDP finalise seat-sharing deal lns
Author
First Published Mar 9, 2024, 12:33 PM IST


న్యూఢిల్లీ: పొత్తు విషయమై  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  తెలుగు దేశం పార్టీ చీఫ్ చంద్రబాబు,జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ లు  శనివారం నాడు గంట పాటు చర్చించారు.  

also read:ప్రపంచంలో పొడవైన సేలా టన్నెల్: ప్రారంభించిన మోడీ

ఈ నెల  7వ తేదీన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు బీజేపీ అగ్రనేతలతో పొత్తు విషయమై చర్చించేందుకు న్యూఢిల్లీ వచ్చారు. ఈ చర్చలకు కొనసాగింపుగా  ఇవాళ  మరోసారి  చంద్రబాబునాయుడు , పవన్ కళ్యాణ్ లు   జే.పీ. నడ్డా, అమిత్ షాతో  మరోసారి సమావేశమయ్యారు. ఈ మూడు పార్టీలు రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయని  సమాచారం.  

also read:కజిరంగ నేషనల్ పార్క్‌లో కలియదిరిగిన మోడీ: ఏనుగు సవారీ (ఫోటోలు)

ఈ విషయమై  అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ప్రచారం సాగుతుంది.   సీట్ల సర్ధుబాటు విషయమై  ఈ మూడు పార్టీల మధ్య  చర్చలు జరగనున్నాయి. బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ,  ఎనిమిది  పార్లమెంట్ స్థానాలను  ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకొందని ప్రచారం సాగుతుంది.

also read:.  అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ: పొత్తు చర్చలు

అయితే ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.మరో వైపు ఆరు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి, ఏడు పార్లమెంట్ స్థానాలను బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన 17 లోక్ సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది.

also read:చైనా సరిహద్దుల్లో రెండు పినాకా రిజిమెంట్లు: మోహరించనున్న భారత్

అరకు, రాజమండ్రి, తిరుపతి, నర్సాపురం,హిందూపూర్,రాజంపేట,తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్టణం స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని సమాచారం.త్వరలోనే జరిగే ఎన్‌డీఏ సమావేశానికి  టీడీపీ చీఫ్ చంద్రబాబును ఆహ్వానించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ పొత్తుకు సంబంధించిన ప్రకటన ఉంటుందనే ప్రచారం సాగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios