ఫిలిపైన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే చేసిన ఓ నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పట్టపగలు.. ఓ పబ్లిక్ మీటింలో.. ఓ యువతికి ఆయన ముద్దు పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం ఫిలిప్పినో కమ్యునిటీ సమావేశం జరిగింది.   ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు దేశాధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే కూడా హాజరయ్యారు. 

క్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అక్కడికి వచ్చిన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘ఈ సభలో ఉన్న మహిళా అభిమానులకు ‘అల్టర్ ఆఫ్ సీక్రెట్స్: సెక్స్, పాలిటిక్స్ అండ్ మనీ ఇన్ ది ఫిలిపైన్ క్యాథలిక్ చర్చ్’’  అనే పుస్తకాన్ని ఇస్తానని ప్రకటించారు. 

దీనికి బదులుగా తనకు ముద్దు ఇవ్వాలని కోరారు. ప్రెసిడెంట్ కోరినట్లుగా ముందుకొచ్చిన ఓ మహిళ ఆయనకు ముద్దు ఇచ్చి.. బుక్‌ను తీసుకుంది. అయితే ఈ ముద్దును సీరియస్‌గా తీసుకోవద్దని, కేవలం సరదా మాత్రమేనని రోడ్రిగో తెలిపారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశాధ్యక్షుడి పదవిలో ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.