Asianet News TeluguAsianet News Telugu

పెంపుడు జంతువులకు దేవుడి ఆశీర్వాదం కోసం చర్చికి పోటెత్తిన జనం.. వైరల్ వీడియో ఇదే

స్పెయిన్‌లోని ఓ చర్చి వద్దకు వేలాది మంది జనాలు తమ పెంపుడు జంతువులతో వచ్చి చేరారు. వారంతా తమ జంతువులను పాస్టర్ వద్దకు తీసుకెళ్లగా ఆయన ప్రార్థనలు చేసి ఆ జంతువులను ఆశీర్వదిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

pet animals blessed in spain church, vidoe went viral
Author
First Published Feb 2, 2023, 6:03 PM IST

న్యూఢిల్లీ: స్పెయిన్‌లోని ఓ చర్చి వద్ద వేలాది మంది తమ పెంపుడు జంతువులతో పోటెత్తారు. తమ పెంపుడు జంతువులకు దేవుడి ఆశీర్వాదం కోసం వారంతా అక్కడ బారులు తీరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జనవరి 17వ తేదీన ఈ ఘటన మ్యాడ్రిడ్‌లోని చర్చి వద్ద చోటుచేసుకుంది. జనవరి 17వ తేదీన సెయింట్ ఆంథోని డేగా జరుపుకుంటారు. ఈయనను జంతువుల రక్షకుడిగా విశ్వసిస్తారు. అందుకే వారంతా తమ పెంపుడు జంతువులతో చర్చి ముందుకు వచ్చి ఆ దేవుడి ఆశీర్వాదాలను తమ జంతువులకు ఇప్పించారు. 

పెంపుడు కుక్కలు, పిల్లులలు, ఇతర అన్ని రకాల పెంపుడు జంతువులను జనవరి 17న చర్చి వద్దకు తీసుకువచ్చారు. ఈ వీడియోలో ప్రజలు తమ పెంపుడు జంతువులను చర్చి పాస్టర్ వద్దకు తీసుకెళ్లగా ఆయన ప్రేయర్ చేస్తూ వాటిని ఆశీర్వదిస్తూ కనిపించారు.

Also Read: బహిరంగంగా డ్యాన్స్ చేసిన జంటకు పదేళ్ల జైలు శిక్ష.. వీడియో ఇదే

అలా వచ్చిన ఓ జంతువు యజమాని మాట్లాడుతూ తమ జంతువు ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైందని వివరించారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లామని, కానీ, అక్కడ వైద్యులు తమ జంతువు ఒక్క రోజుకు మించి బతకడం కష్టమే అని చెప్పారని తెలిపారు. అప్పుడే తాము సెయింట్ ఆంథోనిని ప్రార్థించామని పేర్కొన్నారు. తమ జంతువు మళ్లీ ఆరోగ్యంగా ఉంటే ప్రతి యేటా చర్చికి వచ్చి సెయింట్ ఆంథోనిని ప్రార్థిస్తామని మొక్కినట్టు వివరించారు. అప్పుడు తమ జంతువు అనారోగ్యం నుంచి కోలుకున్నదని అన్నారు. అందుకే ఈ రోజు చర్చికి వచ్చినట్టు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios