మాజిద్ టీనేజ్ నుంచే డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఇటీవల మరోసారి అతడిని డిప్రెషన్ ముంచేసిందని.. మాజిద్ సోదరుడు ఉమర్ తెలిపారు.

పాకిస్తాన్ : ప్రఖ్యాత పాకిస్థానీ స్నూకర్ ప్లేయర్, ఆసియా అండర్-21 రజత పతక విజేత, మాజిద్ అలీ పంజాబ్‌లోని ఫైసలాబాద్ సమీపంలోని తన స్వస్థలమైన సముంద్రిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వయస్సు 28 సంవత్సరాలు. మాజిద్ చిన్నతనంనుంచే డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, కలప కోసే యంత్రంతో గాయం చేసుకుని తన జీవితాన్ని ముగించుకున్నాడని పోలీసులు తెలిపారు. 

అతను అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జాతీయ సర్క్యూట్‌లో అగ్రశ్రేణి ఆటగాడు. నెల వ్యవధిలో మరణించిన రెండవ స్నూకర్ ఆటగాడు మజిద్. గత నెలలో, మరో అంతర్జాతీయ స్నూకర్ ఆటగాడు ముహమ్మద్ బిలాల్ గుండెపోటుతో మరణించాడు.

చైనాలో సెలబ్రిటీ గూస్‌ని తన్ని, చంపిన టూరిస్ట్.. నెటిజన్ల ఫైర్..

మాజిద్ టీనేజ్ వయసు నుండే డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఇటీవల మరోసారి డిప్రెషన్ అటాక్ చేసిందని.. మాజిద్ సోదరుడు ఉమర్ చెప్పాడు. "ఇది చాలా భయంకరమైన, బాధాకరమైన విషయం, ఎందుకంటే అతను తన ప్రాణాలను తీసుకుంటాడని.. మేమెప్పుడూ ఊహించలేదు" అని ఉమర్ అన్నాడు.

పాకిస్థాన్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ చైర్మన్ అలంగీర్ షేక్ మాట్లాడుతూ మజీద్ మృతి పట్ల సమాజం మొత్తం విచారం వ్యక్తం చేస్తుందన్నారు. "చాలా ప్రతిభ కలిగిన ఆటగాడు. యువకుడు.. పాకిస్తాన్‌కు మరెన్నో అవార్డులు తీసుకువస్తాడని చాలా ఆశించాం" అని అన్నారు.

మజీద్‌కు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని షేక్ తెలిపారు. ముహమ్మద్ యూసుఫ్, ముహమ్మద్ ఆసిఫ్ వంటి స్టార్లు ప్రపంచ, ఆసియా ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకోవడంతో స్నూకర్ దేశంలోనే హై ప్రొఫైల్ ఆటగా మారింది. కొంతమంది క్రీడాకారులు ప్రొఫెషనల్ సర్క్యూట్‌కు కూడా గ్యాడ్రుయేట్ అవ్వడంతో క్రేజ్ పెరిగింది.