సెలబ్రిటీ గూస్ డా బావో మరణించడం చైనాలో కలకలం రేపింది. ఆ బాతును తన్నడంతో మెడ విరిగిపోయి, మరణించినట్లు తేలింది.
చైనా : ఓ సెలబ్రిటీ గూస్ మరణం ఇప్పుడు చైనా వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఓ టూరిస్ట్ ప్లేస్ లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ బాతు.. అక్కడికి వచ్చిన సందర్శకుల్లో ఓ చిన్నారిని భయపెట్టిందని..ఆమెతో వచ్చినవారు ఆ బాతును తీవ్రంగా తన్నడంతో.. అది మెడ విరిగి మరణించింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, చైనాలోని ఒక పర్యాటక ప్రాంతంలో ఈ గూస్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ బాతుకు వేలాది మంది ఆన్‌లైన్ అభిమానులు ఉన్నారు. స్టార్ గూస్ గా పేరొందింది. ఇది ఒక చిన్నారిని "భయపెట్టింది" అనే కారణంగా తన్నడంతో చనిపోయింది.
కృతిమ స్వీటెనర్ అస్పర్టమే క్యాన్సర్ కారకం కానుందా?.. డబ్ల్యూహెచ్‌వో అధ్యయనంలో షాకింగ్ సమాచారం..
జంతు హింసకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన కేసు సోషల్ మీడియా వినియోగదారులలో, ముఖ్యంగా చైనీస్ వినియోగదారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. డా బావో అనే అడవి గూస్ ఆన్‌లైన్ సెలబ్రిటీ అని, ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని షిజియాజువాంగ్‌లోని ఒక పర్యాటక ప్రదేశంలో ప్రముఖ ఆకర్షణ అని ఎస్సీఎంపీ పేర్కొంది.
బాతు సున్నితమైన ప్రవర్తనను అనేక వీడియోలతో "బార్-హెడెడ్ గూస్ డా బావో" అనే సోషల్ మీడియా అకౌంట్ ను ఏర్పాటు చేశారు. దీనికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంట్లో పోస్ట్ అయ్యే ఏ వీడియో అయినా 40,000 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదిస్తుంది. ఆ బాతు రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన అప్‌డేట్‌లను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంటారు'
అయితే, గూస్ తమ బిడ్డను భయపెట్టిందని ఓ సందర్శకుడు పేర్కొన్నాడు. దీంతో దాన్ని తన్నడంతో డా బావో మరణించినట్లు సోషల్ మీడియా అకౌంట్ ను ఆపరేట్ చేసే వ్యక్తి ఇటీవల ప్రకటించారు.
అకౌంట్ ఓనర్ ఆ సందర్శకుడితో మాట్లాడి ఓ వీడియోను రికార్డ్ చేశాడు, అందులో ఒక మహిళా పర్యాటకురాలు ఇలా వివరణ ఇచ్చింది : "ఇది నా కుమార్తెకు హాని కలిగించబోయింది". దీనిమీద నెటిజన్లు భిన్నంగా స్పందించారు. బార్-హెడ్ పెద్దబాతులు రక్షిత జాతి కాదా అని చర్చించారు. అధికారులు ఫుటేజీని పోలీసులకు అందించిన తర్వాత నేరస్థుడికి కఠినమైన శిక్ష విధించాలని పిలుపునిచ్చారు.
