సారాంశం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సరిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు పెరిగాయి. భారత్ దెబ్బతో పాకిస్తాన్ లో భయాందోళనలు పెరుగుతున్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యల తర్వాత పాక్ సైన్యం ఒత్తిడిలోకి జారుకుంది. 
 

Operation Sindoor: పాకిస్తాన్ లోని ఉగ్ర‌వాదుల‌పై భారత వైమానిక దళాలు నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' అనంతరం ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇండియన్ ఎయిర్‌స్ట్రైక్స్‌తో పాకిస్తాన్ రెడ్ అలర్ట్ లో ఉంది. దేశాన్ని ఉద్దేశించి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్  చేసిన ప్రసంగం తర్వాత పాకిస్తాన్ దళాలు ఒత్తిడిలోకి జారుకున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశ పరిస్థితులను అర్థం చేసుకోకుండా భారత్ తో కయ్యానికి కాలు దువ్వడమే. 

పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్ లో రెడ్ అలర్ట్ అమలులోకి వచ్చింది. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర పరిస్థితులకై సిద్ధంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. అంతర్గత, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు 24 నుండి 36 గంటలపాటు నిలుపుదల విధించారు. ఇస్లామాబాద్, పంజాబ్‌లో ఉన్న విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. భద్రతా దళాలన్నీ అప్రమత్తంగా ఉండాలని అధికారికంగా ప్రకటించారు. 

అలాగే, దేశంలోని సామాన్యులు తమ ఇళ్లలోకి వెళ్లి లైట్లన్నీ ఆర్పివేయాలని ప్రకటనలు చేయడంతో  పాకిస్థాన్ లో భయాందోళనలు నెలకొన్నాయి. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తర్వాత స్థానికుల్లో యుద్ధ భయాలు మొదలయ్యాయి. పాక్ సైన్యంలో కూడా వణకు మొదలైందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

 

పాకిస్తాన్ లోని ఉగ్రస్తావరాలపై దాడులు ఏప్రిల్ 22న ఫహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ నిర్వహించింది. పహల్గాం దాడిలో 26 మంది పౌరులు మృతి చెందారు. ఆ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందినవారని నిఘా వర్గాలు గుర్తించాయి. అందుకే భారత్ ఉగ్రవాదులను పేంచిపొషిస్తున్న పాక్ పై కఠిన చర్యలు తీసుకుంటోంది. అందుకే అపరేషన్ సింధూర్ ను చేపట్టింది. భారత్ దెబ్బతో పాకిస్తాన్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లోకి వెళ్తోంది.