పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి.. కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదవులను కత్తిరించాడు. ఆ కానిస్టేబుల్ అక్రమ సంబంధం పెట్టుకోవాలని తన భార్యను వేధించాడని, ఒకసారి కలిసి ఆ వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడని పేర్కొన్నాడు. అందుకే కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదవులు కత్తిరించి టార్చర్ చేసినట్టు తెలిసింది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి ఏకంగా పోలీసు కానిస్టేబుల్ చెవులు, పెదాలు, ముక్కును కత్తిరించాడు. ఆ కానిస్టేబుల్ తన భార్యను అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధించాడని, చివరకు ఓ సారి ఒంటరిగా కలిసి ఆమెతో సంగమించాడని నిందితుడు ఆరోపించాడు. ఆ వీడియో తీసి తర్వాత కూడా తరుచూ బ్లాక్ మెయిల్ చేసేవాడని పేర్కొన్నాడు. తనతో సంబంధం పెట్టుకోకుంటే తన కొడుకును చంపేస్తాననీ బెదిరించాడని వివరించాడు. ఈ కారణంగానే ఆ వ్యక్తి మరో 12 మందితో కలిసి కాపుకాసి పోలీసు కానిస్టేబుల్‌ను టార్చర్ చేసినట్టు తెలిసింది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఝాంగ్ జిల్లాలో జరిగింది.
తన భార్యను కానిస్టేబుల్ ఖాసిం హయాత్ తరుచూ వేధించేవాడని ముహమ్మద్ ఇఫ్తికర్ పేర్కొన్నాడు. ఈ కానిస్టేబుల్‌పై మహిళపై దాడి, దోపిడీ, పోర్నోగ్రఫీ సెక్షన్ ల కింద కేసు కూడా పెట్టాడు. అయినా.. ఆ కానిస్టేబుల్ ఆగడాలు ఆగలేవని తెలిపాడు. దీంతో ఇఫ్తికర్ మరో 12 మందితో కలిసి కానిస్టేబుల్ ఖాసిం హయాత్ అంతు చూడాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఖాసిం హయాత్ ఇంటికి వెళ్లుతుండగా.. వారంతా కాపు కాశారు. ఆయనను నిర్బంధించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ కానిస్టేబుల్ చెవులు, ముక్కు, పెదవులను కత్తిరించారు. ఆ తర్వాత కూడా ఆయనను తీవ్రంగా టార్చర్ చేశారు.
ఆ కానిస్టేబుల్‌ను ఝాంగ్ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు తెలిసింది.
ప్రస్తుతం ఇఫ్తికర్ సహా ఆయన సహచరులు పరారీలో ఉన్నారు.
