పాకిస్థాన్ ఎన్నికల బరిలో షారూక్ సోదరి

First Published 8, Jun 2018, 10:46 AM IST
Pakistan elections: Shah Rukh Khan's cousin to contest from Peshawar
Highlights

స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్న షారూక్ సోదరి

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సోదరి పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీచేయనున్నారు. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించారు. పాకిస్థాన్ లో వచ్చే నెల 25వతేదీన జరగనున్న సాధారణ ఎన్నికల్లో షారూఖ్ సోదరి అయిన నూర్జహాన్ ఖైబర్ ఫక్తూన్ ఖవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనుంది.

షారూఖ్ సోదరి అయిన నూర్జహాన్ తన కుటుంబంతో కలిసి షావాలి ఖతాల్ ప్రాంతంలో నివాసముంటోంది. రాజకీయ కుటుంబానికి చెందిన నూర్జహాన్ గతంలో కౌన్సిలరుగా కూడా సేవలందించింది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ తో సంబంధాలు కొనసాగిస్తున్న నూర్జహాన్ గతంలో రెండు సార్లు ముంబై వచ్చి షారూఖ్ కుటుంబసభ్యులను కలిసింది. మొత్తంమీద షారూఖ్ ఖాన్ సోదరి పాక్ ఎన్నికల్లో పోటీ చేయనుండటం చర్చనీయాంశంగా మారింది.

loader