Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ లో షాకింగ్.. ఆస్పత్రి పై కప్పుపై 200 మృతదేహాలు, కుళ్లిపోయి, చెట్టు మొలిచి..

పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హాస్పిటల్ పై కప్పుపై 200 కుళ్లిపోయిన మృతదేహాలు బయటపడ్డాయి. 
 

Over 200 dead bodies found on hospital's roof in Punjab, Pakistan
Author
First Published Oct 15, 2022, 8:31 AM IST

పాకిస్తాన్ : పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్‌లోని నిష్తార్ హాస్పిటల్‌లోని మార్చురీ పైకప్పుపై కుళ్ళిన మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు తారిఖ్ జమాన్ గుజ్జార్, మీడియాకు వివరాలు వెల్లడించారు. దీనిమీద ఆయన మాట్లాడుతూ "నేను నిష్టర్ హాస్పిటల్‌లో సందర్శనకు వెళ్లాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. మీరు మంచిపని చేయాలనుకుంటే.. ఒకసారి మార్చురీ పై కప్పు మీద పరిశీలించండి అని చెప్పాడు’ అని చెప్పుకొచ్చారు. 

ఆ వ్యక్తి చెప్పిన మాటల ప్రకారం చెక్ చేయడం కోసం తాను పై అంతస్తులో ఉన్న మార్చురీకి వెడితే తలుపులు తెరవడానికి అక్కడి సిబ్బంది నిరాకరించారు. దీంతో కోపానికి వచ్చిన తాను మీరు ఇప్పుడు తలుపులు తెరవకపోతే,  మీపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను.. అని హెచ్చరించడంతో వారు తలుపులు తెరిచారని గుజ్జర్ జోడించారు. అక్కడి దృశ్యం తనను తీవ్రంగా కలిచివేసిందని, షాక్ కు గురిచేసిందని ఆయన అన్నారు. 

మార్చురీని తెరిచినప్పుడు ఆ గదిలో దాదాపు 200 మృతదేహాలు పడి ఉన్నాయని.. "కుళ్ళిపోతున్న స్త్రీ, పురుష మృతదేహాలు నగ్నంగా ఉన్నాయి. కనీసం స్త్రీల మృతదేహాలను కూడా కప్పలేదు." దీంతో షాక అయిన నేను ఇదేంటి అని అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే. అవన్నీ వైద్య విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం వాడుతున్నవని చెప్పారని గుజ్జర్ చెప్పారు.

టర్కీ బొగ్గుగనిలో పేలుడు, 25మంది మృతి...

"మీరు ఈ మృతదేహాలను విక్రయిస్తారా? అని నేను మార్చురీ అధికారులను అడిగాను" అలాగే ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని తాను వైద్యులను కోరానని, అయితే వారు మాట్లాడుతూ.. ఈ శవాలు పడి ఉన్న తీరు చూస్తుంటే వైద్య విద్యార్థులు విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్టుగా కనిపించడం లేదని చెప్పారని అన్నారు. ఇక మరో దారుణమైన విషయం ఏంటంటే.. మార్చురీ పై కప్పుమీద ఓ రెండు మృతదేహాలు కుళ్ళిపోయే స్థితికి చేరుకున్నాయి. వాటిమీద పిచ్చిమొక్కలు కూడా మొలిచాయి అని గుజ్జర్ చెప్పారు. తన 50 ఏళ్ల జీవితంలో ఇలాంటివి చూడలేదని, అత్యంత భయంకరంగా ఈ పరిస్థితి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. 

"పైకప్పు మీద ఉన్న శవాలపై రాబందులు, పురుగులు తిరుగుతున్నాయి. మార్చురీ పైకప్పుపై కనీసం 35 మృతదేహాలు ఉన్నాయని మా లెక్కలు చూపించాయి." "వైద్య విద్య ప్రయోజనాల కోసం ఉపయోగించిన తర్వాత మృతదేహాలను నమాజ్-ఎ-జనాజా తర్వాత సరైన ఖననం చేయలేదు. వాటిని అలా పైకప్పుపై విసిరివేసారు" అని గుజ్జర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

శుక్రవారం ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రి మార్చురీ పైకప్పుపై 'డజన్‌ల కొద్దీ' కుళ్లిపోయిన మృతదేహాలు ఉన్నాయన్న వార్త పాకిస్తాన్ లో కలకలం రేపింది. పైకప్పుపై విసిరేసిన మృతదేహాలను పాక్ పంజాబ్ ముఖ్యమంత్రి చౌదరి జమాన్ గుజ్జర్ సలహాదారు వెలుగులోకి తెవడంతో ఆసుపత్రిలో భయాందోళనలు నెలకొన్నాయి.

హృదయ విదారకమైన ఈ సంఘటనపై నిష్టర్ మెడికల్ యూనివర్సిటీ ప్రతినిధి సజ్జాద్ మసూద్ ఒక ప్రకటన విడుదల చేస్తూ...మృతదేహాలు కుళ్ళిపోవడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి విచారణ కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే మార్చురా పైకప్పుపై డజన్ల కొద్ది మృతదేహాలు లేవని, కేవలం నాలుగు మృతదేహాలు మాత్రమే ఉన్నాయని, వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం వాడే ముందు వాటిని సహజంగా డ్రైగా అయ్యేందుకు అలా వదిలేశారని పేర్కొన్నారు.

నాలుగు, ఐదేళ్ల వయసున్న పిల్లల మృతదేహాలను కూడా వైద్యవిద్యార్థుల కోసం వినియోగించేవారని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చాలా మృతదేహాలను పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో పైకప్పుపై ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో మృతదేహాలను డేగలు, రాబందులు తినడానికి వదిలేశారని పుకార్లు చెలరేగాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పంజాబ్ సౌత్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సాకిబ్ జాఫర్ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి, మృతదేహాలను అపవిత్రం చేయడం, వదిలివేయడంపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ స్పెషలైజ్డ్ హెల్త్‌కేర్ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. అదనపు సెక్రటరీ స్పెషలైజ్డ్ హెల్త్ కేర్ ముజామిల్ బషీర్ నేతృత్వంలోని కమిటీ మూడు రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios