Asianet News TeluguAsianet News Telugu

ఒసామా బిన్ లాడెన్ : దశాబ్దాల నాటి ‘అమెరికాకు లేఖ’ వైరల్...ఎందుకంటే..

టిక్‌టాక్‌లో బిన్ లాడెన్  'లెటర్ టు అమెరికా' మళ్లీ తెరపైకి వచ్చింది, అతని మాటలు యువ అమెరికన్ల "జీవితపు దృక్కోణాన్ని" మొత్తంగా మార్చేలా ఉన్నాయి.

Osama bin Laden : Decades old 'Letter to America' goes viral - bsb
Author
First Published Nov 17, 2023, 11:17 AM IST | Last Updated Nov 17, 2023, 11:17 AM IST

టిక్‌టాక్‌లో ఒసామా బిన్ లాడెన్ రాసిన "లెటర్ టు అమెరికా" మళ్లీ వైరల్ గా మారి వివాదాస్పదమవుతోంది. టిక్ టాక్ యూజర్లలో ముఖ్యంగా యువ అమెరికన్లలు దీనిమీద ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. 2002లో రాసిన ఈ రెండు పేజీల లెటర్ లో 9/11 దాడులకు దిగడం వెనుక ఉన్న భావజాలాన్ని , అల్-ఖైదా వ్యవస్థాపకుడు వివరించాడు. ఇది అమెరికాకి వ్యతిరేకంగా ఒక వివాదంగా పనిచేస్తుంది.

ఈ లెటర్ రెండు దశాబ్దాల పాతదైనప్పటికీ టిక్‌టాక్‌లో కొత్త వ్యూయర్స్ ను ఆకర్షించింది. కొంతమంది యూజర్స్ బిన్ లాడెన్ దృక్పథంతో ఒక్కసారి షాక్ అవుతున్నారు. అంగీకరిస్తున్నారు. దీనికి నిదర్శనమే #lettertoamerica అనే హ్యాష్‌ట్యాగ్ 4.5 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం. సోషల్ మీడియా ట్రెండ్ ఎలా ఉందో ఇదే చెబుతుంది. 

israel - hamas war :గాజా పార్లమెంట్ బిల్డింగ్ ను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్ దళాలు.. వీడియో విడుదల..

టిక్ టాక్ యూజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇకరు దీన్ని "ప్రతి ఒక్కరూ చదవాలి.. ఇది వైల్డ్" అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, మరొకరు ఆ లెటర్ చదివిన తర్వాత "అస్తిత్వ సంక్షోభాన్ని" ఎదుర్కొంటున్నట్లు అంగీకరించారు. జీవితంపై తన దృక్కోణాన్ని మొత్తం మార్చిందని పేర్కొన్నారు.

“నేను జీవితాన్ని ఎప్పుడూ ఒకేలా చూడను, ఈ దేశాన్ని (అమెరికా) ఒకేలా చూడను. ఆ లెటర్ చదివి ఉంటే, మీరు అస్తిత్వ సంక్షోభంలో ఉన్నట్లయితే నాకు తెలియజేయండి. ఎందుకంటే గత 20 నిమిషాల్లో, నేను నమ్మిన, జీవించిన మొత్తం జీవితం గురించి నా దృక్కోణం మొత్తం మారిపోయింది, ”అని ఒకరు రాశారు.

అమెరికాకు వ్యతిరేకంగా బిన్ లాడెన్ చేసిన ఆరోపణలు, ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు దాని మద్దతు, పాలస్తీనియన్ల అణచివేతకు సంబంధించి, లేఖలో ప్రధాన అంశాలు. ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనాలోని ముస్లింల బాధలకు దారితీసేలా అమెరికా నిధుల కేటాయింపు చర్యలకు నిందించాడు, ప్రతీకార చర్యగా అమెరికన్ పౌరులపై దాడులను సమర్థించాడు.

"మూలధనంపై యూదుల వినాశకరమైన నియంత్రణ, అది మిమ్మల్ని బానిసలుగా మార్చే రోజు ఒకటి వస్తుందని  మీ మాజీ అధ్యక్షుడు మిమ్మల్ని గతంలో హెచ్చరించాడు" అని లేఖలో పేర్కొన్నారు. "అపారమైన ఆర్థిక సామర్థ్యాలతో కూడిన యూదు లాబీ ద్వారా మీ పరిపాలనపై ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా మీరు మా పాలస్తీనాను ఆక్రమించడంలో అణచివేతదారులైన ఇజ్రాయిలీలకు మద్దతు ఇస్తూనే ఉన్నారు" అని బిన్ లాడెన్ రాశాడు.

"పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది, సెప్టెంబర్ 11 తర్వాత మీ అణచివేత,  మాపై దౌర్జన్యం దాడికి కారణం అని బుష్ గ్రహించే వరకు మీ అధ్యక్షులెవరూ దాని గురించి మాట్లాడలేదు. సముద్రం నుండి నది వరకు అన్నింటినీ కలిసిన పాలస్తీనా భూమిని మాకు తిరిగి ఇచ్చే రోడ్‌మ్యాప్‌ను అమలు చేయాలి, ఇది ఇస్లామిక్ భూమి, ఇది ఏ పార్టీకి బిజినెస్ కు అనుమతించబడలేదు" "పాలస్తీనా బందీగా ఉండదు. ఎందుకంటే దాని సంకెళ్ళను మేము తెంచడానికి ప్రయత్నిస్తాం. యునైటెడ్ స్టేట్స్ తన అహంకారానికి క్రైస్తవుల రక్తం, వారి నిధులతో బదులు చెల్లించాలి. "

నవంబర్ 15, 2023న తన వెబ్‌సైట్ నుండి లేఖను తీసివేయాలని గార్డియన్ తీసుకున్న నిర్ణయం ఊహాగానాలు, కుట్ర సిద్ధాంతాలకు ఆజ్యం పోసింది, కొందరు సమాచారాన్ని అణిచివేసేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం ఇది అన్నారు.  కొంతమంది టిక్‌టాక్ వినియోగదారులు షాక్‌ను వ్యక్తం చేసినప్పటికీ, బిన్ లాడెన్ లేఖను సమర్థిస్తున్న వారిపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువడుతున్నాయి. ఇలాంటి సెంటిమెంట్‌లు ట్రెండ్ మానిప్యులేషన్ క్యాంపెయిన్‌లో భాగమేనని కొందరు వాదిస్తారు, మరికొందరు లేఖలోని "సత్యాన్ని" వెలికితీసే ఆలోచనను "హాస్యాస్పదంగా" కొట్టిపారేశారు.

దశాబ్దాల నాటి లేఖ అనుకోకుండా.. ఊహించని విధంగా ఇలా వైరల్ అవ్వడం..  చారిత్రక సంఘటనలు, సోషల్ మీడియా పోకడలు, ప్రజల అవగాహన మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యను తెలుపుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios