ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తోన్న ఒమిక్రాన్ లక్షణాల(Omicron Symptoms)పై  UK లో ఓ అధ్యయనం జ‌రిగింది.  ఈ అధ్య‌యనంలో ప్ర‌ధానంగా ఒమిక్రాన్ వేరియంట్   సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయనే అంశంపై ప‌రిశోధ‌నలు జ‌రిగాయి. కోవిడ్-19   ట్రాకింగ్ స్టడీ అనే పేరుతో సర్వే నివేదికను డైలీ మెయిల్ పేపరులో వెల్లడించారు. 

Omicron Symptoms : ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచదేశాలను భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కొత్త వేరియంట్ కొద్ది వారాల వ్య‌వ‌ధిలోనే దాదాపు 80 దేశాల్లో విస్త‌రించింది. సెకండ్ వేవ్ లో భారీ ప్రాణనష్టాన్ని కలిగించిన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ ఎంతో ప్రమాదకారని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే యూరప్ దేశాలన్నీ దాదాపు లాక్ డౌన్ దిశగా వెళుతుండగా, భారత్ లోనూ రోజురోజుకూ వ్యాప్తి పెరుగుతోంది. 

ఈ క్ర‌మంలో ప్రపంచ దేశాల‌ను వ‌ణికిస్తోన్న ఒమిక్రాన్ లక్షణాలపై UK లో ఓ అధ్యయనం జ‌రిగింది. ఈ అధ్య‌యనంలో ప్ర‌ధానంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయనే అంశంపై ప‌రిశోధ‌నలు చేశారు. కోవిడ్-19 ట్రాకింగ్ స్టడీ అనే పేరుతో సర్వే నివేదికను డైలీ మెయిల్ పేపరులో వెల్లడించింది.

Read Also: పాల వ్యాన్‌లో మద్యం తరలింపు.. చాకచక్యంగా పట్టుకున్న ఏపీ పోలీసులు

ఈ నివేదిక ప్ర‌కారం.. ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ప్ర‌ధానంగా.. ముక్కు కారటం, తలనొప్పి, అలసట, తుమ్ములు, గొంతు నొప్పి, సాధార‌ణ జ‌లుబు లాంటి ల‌క్ష‌ణాలు ఉంటాయని కోవిడ్ -19 సింప్టమ్ ట్రాకింగ్ అధ్యయనం తెలిపింది. ZOE సింప్టమ్ ట్రాకింగ్ స్టడీని లండ‌న్ లో ఒమిక్రాన్ బారిన పడిన వేలాది మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక రూపోందించినట్లు అధ్యయనకారులు వెల్లడించారు. అలాగే.. ఈ వైర‌స్ సోకిన వారిలో వాంతి అవుతున్నట్లు, కడుపులో తిప్పేయటం, త‌ల తిరిగినట్లుగా అనిపించటం.. గొంతులో గరగర లాంటి లక్షణాలు కనిపిస్తాయని తాజా అధ్యయనం లో తేలింది. 

Read Also: రష్యా ప్రభుత్వానికి 2.29 లక్షల డాలర్ల ఫైన్ చెల్లించిన ఫేస్‌బుక్.. ఎందుకంటే?

అంతే కాదు.. క‌రోనా సోకిన వారిలో మాదిరిగా.. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ద‌గ్గు, తీవ్ర జ్వ‌రం, ఆ త‌రువాత రుచి, వాస‌నలు కోల్పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలేవి క‌నిపించ‌లేద‌ని అధ్య‌య‌న‌కారులు తెలిపారు. ఇత‌ర వైర‌స్ ల‌తో పోల్చితే.. ఒమిక్రాన్ వైర‌స్ ల‌క్ష‌ణాల తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంటాయ‌నీ, వాటిని తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు వైద్య నిపుణులు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో క్రిస్‌మ‌స్, నూతన సంవత్సర వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, క‌రోనా నియ‌మ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా భౌతిక దూరం పాటించటం, శానిటైజ్ చేసుకోవటం,వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. Omicron ఇప్ప‌టికే అనేక మంది శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేశారు. ఇత‌ర వేరియంట్ల కంటే..త‌క్కువ‌, తేలికపాటి అనారోగ్యం ల‌క్ష‌ణాలున్నాయ‌నీ, అయినంత మాత్ర‌నా త‌క్కువ అంచ‌న వేయొద్ద‌ని శాస్త్ర‌వేత్తలు హెచ్చ‌రిస్తోన్నారు. ఈ వేరియంట్ గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వైద్య నిపుణులు.

ఇదిలా ఉంటే.. UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) శనివారం UKలో 10,000 కంటే ఎక్కువ కొత్త Omicron కేసులు నమోదయ్యాయని, ఇంత ఎక్కువ మొత్తంలో అత్యధిక కేసులు న‌మోదు అయ్యాయి. శుక్ర‌వారం 3,201 కేసులు న‌మోదు కాగా.. ఒక శ‌నివారం ఒక రోజే 10,059 ఓమిక్రాన్ కేసులను ఏజెన్సీ నివేదించింది. అంటే ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే మూడు రెట్లు ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,968కి చేరుకుంది. అలాగే.. Omicron వేరియంట్ కార‌ణంగా మ‌రణించిన వారి సంఖ్య ఒకటి నుండి ఏడుకి పెరిగింది. ఇక మ‌న‌దేశంలో కూడా ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దాదాపు 145 ఓమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.