Omicron: ఏడాది కింద చూసిన డిసీజ్ కాదు.. ఇది.. : ఆక్స్‌ఫర్డ్ సైంటిస్ట్

ఒమిక్రాన్ వేరియంట్ అధిక తీవ్రతతో వ్యాధి కలిగించడం లేదనే రిపోర్టులను పేర్కొంటూ ఏడాది కింద చూసిన డిసీజ్‌కు దీనికి చాలా బేధం ఉన్నదని ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టు పేర్కొన్నారు. గత వేవ్‌లలో కరోనా మహమ్మారి మృత్యు విలయం సృష్టించిందని, ఈ సారి కేసుల్లో తీవ్రత తక్కువగా ఉన్నదని, హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య కూడా కేసులతో పోల్చితే తక్కువగా ఉన్నదని తెలిపారు. 
 

omicron not same diseas last year we were seen says oxford scientist

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో విలయతాండవం చేసింది. అయితే, గతేడాది ప్రజలను అతలాకుతలం చేసిన డిసీజ్(Disease) ఇది కాదని ఒమిక్రాన్ (Omicron Variant) గురించి ఆక్స్‌ఫర్డ్ సైంటిస్ట్(Oxford Scientist) చెప్పారు. ఈ వేరియంట్ కలిగించే వ్యాధి మరీ సీరియస్‌గా లేదని వివరించారు. నవంబర్ చివరిలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త స్ట్రెయిన్ మైల్డ్‌ డిసీజ్ కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ సోకి హాస్పిటల్‌లో చేరిన వారూ ఎక్కువ కాలం చికిత్స తీసుకోవాల్సిన అవసరం పడట్లేదని వివరించారు. గతేడాది కరోనా పేషెంట్లతో హాస్పిటళ్ల ఐసీయూలు నిండిపోయాయని, చాలా మంది అసహజ మరణానికి గురయ్యారని పేర్కొన్నారు. ఇదంతా ఇప్పుడు యూకే చరిత్రలో కలిసిపోయిన ఉదంతమని, ఇకపై అలాంటి దృశ్యాలు పునరావృతం కావనే భావిస్తున్నట్టు ఆక్స్‌ఫర్డ్‌లో మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జాన్ బెల్ తెలిపారు.

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో చాలా దేశాలు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి. ఇదే తీరులో యూకే కూడా వెళ్తుందని భావించారు. కానీ, నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధించబోమని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆ దేశంలో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి. సైన్స్ ఒకటి చెబుతుంటే.. చట్టాలు మరో దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టు జాన్ బెల్ బీబీసీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేరియంట్‌తో కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయని, కానీ, హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య కేసులతో పోల్చితే తక్కువగా ఉన్నాయని వివరించారు. ఆక్సిజన్ అవసరమూ చాలా తక్కువ మందికే ఉన్నదని పేర్కొన్నారు.

Also Read: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. నిన్నటి కంటే 43 శాతం అధికం.. 961కి చేరిన ఒమిక్రాన్ కేసులు..

అయితే, నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రొవైడర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ హాప్సన్ కొంత వేరుగా స్పందించారు. ఒమిక్రాన్ వేరియంట్ వృద్ధులకు ఎక్కువగా సోకితే తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పటికీ తెలియదని అన్నారు. క్రిస్మస్ వేడుకలకు రెండు లేదా మూడు తరాల బంధువులు కలుస్తారని, తద్వారా వృద్ధులకూ ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అయ్యే ముప్పు ఉన్నదని తెలిపారు. కాగా, ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో గత ఏడాది కేసులను దృష్టిలో పెట్టుకుని వైద్యులు, ఇతర సిబ్బంది జంకుతున్నారు. చాలా మంది హాస్పిటళ్లకు సెలవులు పెడుతున్నారని, ఒక వేళ కేసులు విస్ఫోటనంగా పెరిగితే పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయ్యే అవకాశం ఉన్నదని వివరించారు.

Also Read: Omicron: ఒమిక్రాన్ దెబ్బకు అమెరికా విలవిల.. ఒక్కరోజే 5 లక్ష‌ల కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే తాజా కేసుల సంఖ్య 43 శాతం పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించగా.. ఇప్పటివరకు 961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. ఒమిక్రాన్ బారిన పడ్డ వారిలో 320 మంది కోలుకున్నారని వెల్లడించింది. ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. ఢిల్లీలో అత్యధికంగా 263 కేసులు నమోదు కాగా,  మహారాష్ట్రలో 257, గుజరాత్‌లో 97, రాజస్తాన్‌లో 69, కేరళలో 65 కేసులు నమోదయ్యాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios