Pnemonia: చైనాలో ఆసుపత్రులకు బాధితులు, నివేదిక కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

చైనాలో  కొత్త రకం న్యుమోనియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడ  చైనాను  నివేదిక కోరింది.

now, pnemonia, out break scare in china, as hosps overwhelmed with sick kids check  whos precautions lns

బీజింగ్:పిల్లలలో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియా కేసుల పెరుగుదలపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) అధికారికంగా  చైనా నుండి  నివేదిక కోరింది. బీజింగ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో న్యుమోనియో వ్యాప్తి చెందుతుంది. దీంతో  దేశంలోని పలు ఆసుపత్రుల్లో అనారోగ్యంతో చేరుతున్న పిల్లల సంఖ్య  రోజు రోజుకు పెరిగిపోతుంది.ఈ తరుణంలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను ఈ విషయమై  పూర్తిస్థాయి నివేదిక కోరింది.

ఈ నెల  23న  నేషనల్ హెల్త్ కమిషన్  చైనాలోని పిల్లల్లో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలను గుర్తించినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో  పాటు  ఇన్‌ఫ్లూఎంజా మైకోప్లాస్మా న్యుమోనియో, (చిన్నపిల్లలను ప్రభావితం చేసే సాధారణ బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్) శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్‌వీ), సార్స్ సీఓవీ 2 వంటి వ్యాధికారకాల కారణంగా  న్యుమోనియా కేసులు పెరిగినట్టుగా  ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

 

ఈ ఏడాది అక్టోబర్  మధ్య నుండి  ఉత్తర చైనాలో గత మూడేళ్లతో పోలిస్తే  ఇన్ఫ్లుఎంజా ప్రభావం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా  నుండి అదనపు సమాచారాన్ని కోరుతుంది. అంతేకాదు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసులు చేస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలు

1. సిఫారసు చేసిన టీకాతో  శ్వాసకోశ అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడం
2.అనారోగ్యాన్ని గురైన వారిని  ఇతరులతో దూరంగా ఉంచడం
3.అనారోగ్యంగా ఉన్నవారిని ఇంట్లో ఉంచడం
4.అనారోగ్యానికి గురైన వారికి అవసరమైన పరీక్షలు, వైద్య సంరక్షణ అందించడం
5.తగిన విధంగా మాస్కులు ధరించాలి
6.మంచి వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
7.రెగ్యులర్ గా చేతులు శుభ్రపరుచుకోవాలి.

చైనాలో కొత్త న్యుమోనియా వ్యాప్తిపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే

పిల్లల్లో  కొత్త రకం న్యుమోనియా వ్యాధి లక్షణాలు కన్పించినట్టుగా  ప్రోమెడ్ సంస్థ  ప్రకటించినట్టుగా  ది టెలిగ్రాఫ్ పత్రిక కథనం ప్రచురించింది.

బీజింగ్ లియానింగ్ ఆసుపత్రుల్లో    న్యుమోనియాతో బాధపడుతున్న పిల్లలు ఎక్కువగా ఉన్నారని తైవాన్ కు చెందిన ఎఫ్ టీ వీ న్యూస్ నుండి అందిన తాజా నివేదిక తెలుపుతుంది.

చాలా మంది ఆసుపత్రుల్లో ఉన్నారని  ఈ నివేదిక చెబుతుంది. దగ్గు ఉండదు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. అంతేకాదు చాలామందికి పల్మనరీ నోడ్యూల్స్ అభివృద్ది చెందుతాయని  ఎఫ్ టీ వీ  నివేదిక వెల్లడించింది.

జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలున్న పిల్లలను స్కూళ్లకు అనుమతించడం లేదు.  ఆసుపత్రిలో  చేరాలని  టీచర్లు సూచిస్తున్నారు.లియానింగ్ ప్రావిన్స్ లోని డాలియన్ చిల్డ్రన్స్ ఆసుపత్రి లాబీ కూడ అనారోగ్య పిల్లలతో  నిండి ఉందని  స్థానిక మీడియా  తెలిపింది.చికిత్స కోసం ఆసుపత్రుల వద్ద రెండు గంటల పాటు  ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయని చెబుతున్నాయని స్థానిక మీడియా రిపోర్టు చేసింది.

ఇదిలా ఉంటే  దీన్ని వాకింగ్  న్యుమోనియాగా కూడ పిలుస్తున్నారని  ప్రొమెడ్  సంస్థ  తెలిపింది. కరోనా  లాక్ డౌన్ లేకుండా  శీతాకాలంలో ప్రవేశిస్తున్నందున  ఈ రకమైన వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఆ సంస్థ అభిప్రాయపడింది.

యూకే, అమెరికా సహా ఇతర దేశాల్లో  కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత  ఆర్ఎస్‌వీ, ఫ్లూ వంటి వ్యాధుల్లో ఇదే విధమైన పెరుగుదలను చూసినట్టుగా టెలిగ్రాఫ్ కథనం తెలిపింది.

వాకింగ్ న్యుమోనియా  చిన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. గొంతు నొప్పి, అలసట, వారాలు, నెలల పాటు దగ్గుతో ఈ వ్యాధిగ్రస్తులు బాధపడుతుంటారు. చివరికి ఇది న్యుమోనియాగా మారుతుందని  ఈ నివేదిక తెలిపింది.

కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో  మైకోప్లాస్మా న్యుమోనియా ఇన్ ఫెక్షన్ల వ్యాప్తి  ప్రారంభమైందని  చైనీస్ పీఎల్ఏ జనరల్ ఆసుపత్రి సెవెంత్ మెడికల్ సెంటర్ పిల్లల వైద్య కేంద్రం డైరెక్టర్ ఝౌహుక్సియా  వ్యాఖ్యలు చేసినట్టుగా  చైనా డైలీ పేర్కొంది.

చైనాలో కొత్త రకం  న్యుమోనియా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా ఆంక్షల ఎత్తివేత తర్వాత ఈ కేసుల సంఖ్య ప్రారంభమైంది. న్యుమోనియా కేసుల విషయమై ప్రపంచ ఆరోగ్యసంస్థ చైనాను నివేదిక కోరింది.  అంతేకాదు  పలు సూచనలు చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios