G20 Summit: ఉత్తర కొరియాతో అన్నింటా దగ్గరి సంబంధాలు: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రెమ్లిన్‌లో సమావేశం అయ్యారు. ఉభయ దేశాలు అన్ని రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పుతిన్ పిలుపు ఇచ్చారు. ఉత్తర కొరియా 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: ఒక వైపు జీ 20 శిఖరాగ్ర సమావేశాలు భారత్‌లో జరుగుతుండగా మరో వైపు జీ 20 సభ్యదేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సాహసికుడు, వివాదాస్పదుడుగా పేరున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమయ్యారు. రష్యాలో వీరిద్దరూ భేటీ అయ్యారు. సమావేశం అనంతరం, వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. ఉత్తర కొరియాకు 75 వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బహుముఖీనంగా బలమైన సంబంధాల కోసం పుతిన్ పిలుపు ఇచ్చారు.
భారత దేశం ఈ ఏడాది జీ 20 గ్రూపునకు అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సదస్సులోనూ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం గురించి ఏకాభిప్రాయంపై చర్చ జరుగుతూనే ఉన్నది. ఈ గ్రూపులోని చాలా దేశాలు రష్యాను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, రష్యాను సమర్థించిన చైనా కూడా ఈ సదస్సుకు హాజరవ్వలేదు. ఇదిలా ఉండగా, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య చర్చను కొనసాగించాలని, శాంతి పునరుద్ధరణ కోసం భారత్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల్లో ఎటువైపూ మొగ్గు చూపలేదు. ఈ నేపథ్యంలో భారత్‌లో జరుగుతున్న జీ 20 సదస్సులో ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం గురించిన చర్చపై ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 632 మంది దుర్మరణం, వందలాది మంది క్షతగాత్రులు.. వివరాలివే (Video)
రష్యా, ఉత్తర కొరియాలు ఉభయ దేశాల అభివృద్ధి కోసం కలిసి పని చేశాయని పుతిన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇది పూర్తిగా ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల లక్ష్యంగానే ఉంటాయని వివరించారు. కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియా భద్రత, సుస్థిరతకు దోహదంగా ఉంటాయని తెలిపారు.
ఉత్తర కొరియాను తొట్టతొలిగా సోవియట్ యూనియన్ గుర్తించిందని పుతిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ రెండు దేశాల మధ్య సంబంధాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అవి స్నేహం, మంచి ఇరుగుపొరుగు, పరస్పర గౌరవం అనే సూత్రాలపైనే కొనసాగుతున్నాయని వివరించారు. ఉత్తర కొరియా ప్రజలు శాంతియుతంగా, సుభిక్షంగా జీవించాలని కోరుతున్నట్టు పుతిన్ తెలిపారు.