న్యూడిల్లీ: స్వయంప్రకటిత దేవుడు, వివాదాస్పద ఆద్యాత్మిక గురువు నిత్యానంద తన సామ్రాజ్యంలోకి భారతీయుల రాకను నిషేధించారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్రుతి నేపథ్యంలో తన దేశంగా ప్రకటించుకున్న కైలాస ద్వీపంలోకి భారతదేశంనుండే కాదు మరికొన్ని దేశాలనుండి వచ్చే భక్తుల అనుమతిని నిరాకరించారు. ఈ మేరకు నిత్యానంద పేరిట ఓ ప్రకటనను విడుదల చేశారు. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో బ్రెజిల్‌, ఐరోపా యూనియ‌న్‌, మ‌లేషియాతో పాటు భార‌త్ నుంచి భ‌క్తులు, ప‌ర్యాట‌కుల రాక‌పై నిషేదం విధించారు. తదుపరి ఆదేశాల వ‌ర‌కు ఈ నిషేధం  అమల్లోకి వుంటుందని పేర్కొన్నారు. 

read more  షాకింగ్ : గాలిద్వారా కరోనా వ్యాప్తి.. స్పష్టం చేస్తున్న అంతర్జాతీయ నివేదికలు..

ఇక ఇప్పటికే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో  భారత్ ను రెడ్ లిస్ట్ లో చేర్చింది యూకే.  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా పర్యటన రద్దైన కొద్దిగంటల్లోనే  ఆ దేశం ఈ నిర్ణయం తీసుకొంది.   ఈ ఏడాదిలో రెండోసారి బ్రిటన్ ప్రధాని  ఇండియా టూర్ రద్దైంది.

 ఇండియాతో పాటు సుమారు 40 దేశాలను  బ్రిటన్ రెడ్ లిస్ట్ లో చేర్చింది.  రెడ్ లిస్ట్ జాబితాలో ఉన్న దేశానికి చెందిన పౌరులు యూకేలో నిషేధం విధించారు. బ్రిటీష్ లేదా ఐరిష్ జాతీయులైతే  యూకేలో నివాస హక్కులు కలిగి ఉంటేనే ప్రవేశానికి అనుమతి  లభిస్తోంది. అయితే  ప్రభుత్వం నిర్ధేశించిన క్వారంటైన్ సెంటర్లలో 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి.బంగ్లాదేశ్, కెన్యా, పాకిస్తాన్, పిలిఫ్పిన్స్ దేశాలపై  యూకే ఇప్పటికే నిషేధం విధించింది.

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ  వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మే 1 నుండి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకొంది.