రాబోయే మహమ్మారులు మరింత ప్రమాదకరం: ఆక్స్ ఫర్డ్ టీకా సృష్టికర్త హెచ్చరికలు

ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచంలో చాలా మ‌హ‌మ్మారులు వ‌చ్చి వెళ్లాయి. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హమ్మారి యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. మ‌రీ ముఖ్యంగా అనేక మ్యూటెష‌న్ల‌కు లోన‌వుతూ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సృష్టిక‌ర్త‌ల్లో ఒక‌రైనా ప్రొఫెస‌ర్ డేమ్ సారా గిల్బ‌ర్ట్.. క‌రోనా వైర‌స్ చివ‌రిది కాద‌నీ, రాబోయే మ‌హ‌మ్మారులు మ‌రింత ప్రాణాంత‌కంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. 
 

Next Pandemic Could Be More Lethal Than Covid

ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు అన్ని దేశాల‌ను చాలా మ‌హ‌మ్మారుల‌ను ఎదుర్కొన్నాయి. అయితే, ప్ర‌స్తుతం విజృంభిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి మాత్రం గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాయి. క‌రోనా వైర‌స్ అనేక మ్యూటెష‌న్ల‌కు గుర‌వుతూ.. కొత్త వేరియంట్లు పుట్టుకురావ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇదివ‌ర‌కు ఉన్న క‌రోనా వేరియంట్ల కంటే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దిగా భావిస్తున్న అంచ‌నాలు క‌లక‌లం రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సృష్టికర్తలలో ఒకరైన ప్రొఫెస‌ర్ డేమ్ సారా గిల్బ‌ర్ట్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌పంచ దేశాల‌న్నింటిని ఆలోచ‌న‌లో ప‌డేశాయి. అలాగే, మాన‌వ మ‌నుగ‌డ కోసం యావ‌త్ ప్ర‌పంచం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను  గుర్తుచేస్తున్నాయి. 

Also Read: గోవా ఎన్నిక‌ల్లో టీఎంసీతో ఎంజీపీ దోస్తాన్ !

 

ప్ర‌స్తుతం తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లిగొన్న క‌రోనా వైర‌స్ క‌న్నా.. భ‌విష్య‌త్తులో వ‌చ్చే మ‌హ‌మ్మారులు మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా, ప్రాణాంత‌కంగానూ ఉంటాయ‌ని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సృష్టికర్తలలో ఒకరైన ప్రొఫెస‌ర్ డేమ్ సారా గిల్బ‌ర్ట్ హెచ్చ‌రించారు.  క‌రోనా వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచానికి నేర్పుతున్న పాఠాలు మ‌ర్చిపోకూడ‌ద‌ని వివ‌రించారు. మున్ముందు రాబోయే మ‌హ‌మ్మారుల‌ను (కొత్త కొత్త వైర‌స్‌ల‌ను) ఎదుర్కొవ‌డానికి ప్ర‌పంచం సిద్ధంగా ఉంద‌నే విష‌యాన్ని నిర్ధారించుకోవాల‌ని గిల్బ‌ర్ట్ అన్నారు.  బ్రిట‌న్‌లో జ‌రిగిన 44వ రిచ‌ర్డ్ డింబ్లేబీ లెక్చ‌ర్ స‌ద‌స్సులో  సారా గిల్బ‌ర్ట్  పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. "నిజం ఏమిటంటే, భవిష్యత్తులో వచ్చే వైరస్ లు మరింత విధ్వంసకరంగా, ప్రాణాంత‌కంగా  ఉండవచ్చు. అది మరింత అంటువ్యాధి కావచ్చు, లేదా మరింత ప్రాణాంతకం కావచ్చు లేదా రెండూ కావచ్చు. మన జీవితాలను, మన జీవనోపాధికి ముప్పు కలిగించే వైర‌స్ ల‌లో క‌రోనా మ‌హ‌మ్మారే చివ‌రిది కాద‌నేది గుర్తించాలి.  భ‌విష్య‌త్తులో రాబోయే మ‌హ‌మ్మారుల‌ను ఎదర్కొనేందుకు ప్రపంచం మెరుగ్గా సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవాలి. వైర‌స్‌ల‌ను ఎదుర్కొనే  పోరాటంలో ఇప్ప‌టికే  ఎంతో ప్ర‌గ‌తి సాధించాం.  అయితే, రాబోయే మ‌హ‌మ్మారుల‌ను ఎదుర్కొనేందుకు అధిక మొత్తంలో  ఫండింగ్ అవ‌స‌రం" అని ప్రొఫెస‌ర్ డేమ్ సారా గిల్బ‌ర్ట్ అన్నారు. 

Also Read: భార‌త్, ర‌ష్యా మ‌ధ్య పలు ర‌క్ష‌ణరంగ‌ ఒప్పందాలు

ప్ర‌స్తుతం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ గా  సారా గిల్బర్ట్  ఉన్నారు. ఆమె ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సృష్టికర్తలలో ఒక‌రు.  వైర‌స్‌ల‌పై త‌మ ప‌రిశోధ‌న‌లు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. ఇక ప్ర‌స్తుతం ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి సైతం ఆమె మాట్లాడారు. ఇదివ‌ర‌కు వెలుగుచూసిన క‌రోనా వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ అధిక వ్యాప్తిలో విజృంభించే అవ‌కాశాలున్నాయ‌ని అన్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఒమిక్రాన్ వేరియంట్ యొక్క స్పైక్ ప్రొటీన్‌లో వైరస్ వ్యాప్తిని పెంచే ఉత్పరివర్తనలు అధికంగా ఉండ‌ట‌మేన‌ని చెప్పారు.  కాబ‌ట్టి ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న క‌రోనా వ్యాక్సిన్లు  ఒమిక్రాన్ వేరియంట్‌పై త‌క్కువ ప్ర‌భావం చూపే అవ‌కాశాలు సైతం ఉన్నాయని వెల్ల‌డించారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఒక నిర్ధార‌ణ‌కు రావ‌డానికి త‌గినంత స‌మాచారం ప్ర‌స్తుతం అందుబాటులో లేద‌న్నారు. ఒమిక్రాన్ గురించి మరింత డేటా అందుబాటులోకి వ‌చ్చేంత వ‌ర‌కు అంద‌రూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ముఖ్య‌మ‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న టీకాలు అంద‌రికీ వేయాల‌ని సూచించారు. 

Also Read: మ‌య‌న్మార్ లీడ‌ర్ ఆంగ్ సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు శిక్ష

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios