సారాంశం

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అక్షర్‌ధామ్ గుడిని సందర్శించారు.   స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన న్యూజిలాండ్-భారత్ మధ్య సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేసారు. 

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మంగళవారం BAPS స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ మందిరాన్ని సందర్శించారు. ఆయనతో పాటు 110 మంది సభ్యుల బృందం కూడా ఉంది. ఆ బృందంలో న్యూజిలాండ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు,  ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు ఉన్నారు.

ప్రధాని లక్సన్, ఆయన బృందానికి ఆలయ సిబ్బంది గుడి ఆవరణలో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, గుడి గొప్పతనాన్ని దగ్గరగా చూశారు. ఈ సందర్భంగా లక్సన్ స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ శాంతి, సామరస్యం, శ్రేయస్సు కోసం ప్రార్థించారు.  

View post on Instagram
 

అక్షర్ ధామ్ ఆలయ పర్యటనలో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్‌తో పాటు మంత్రులు టాడ్ మెక్‌క్లే, మార్క్ మిచెల్, లూయిస్ అప్‌స్టన్ పాల్గొన్నారు.అలాగే చాలా మంది ఎంపీలు, న్యూజిలాండ్ హైకమిషనర్ పాట్రిక్ రాటా, టాప్ బిజినెస్ లీడర్లు కూడా ఈ పర్యటనలో భాగమయ్యారు.

మావోరీ భాషలో ‘సత్సంగ్ దీక్ష’ గ్రంథం ఆవిష్కరణలో ప్రధాని లక్సన్‌ పాల్గొన్నారు. ‘సత్సంగ్ దీక్ష’ మొదటి మావోరీ భాష అనువాద ప్రతిని ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ఈ గ్రంథాన్ని మహంత్ స్వామి మహారాజ్ రాశారు. ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణ, అంతర్గత శాంతి, నిస్వార్థ సేవకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ అనువాదం రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

పర్యటన ముగింపులో మహంత్ స్వామి మహారాజ్ ప్రధాని లక్సన్‌కు ఒక వ్యక్తిగత లేఖ రాశారు. ''అక్షర్‌ధామ్‌కు రావడం, ఇక్కడ గడిపిన సమయం సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను మీరు గౌరవిస్తారని చూపిస్తుంది. అక్షర్‌ధామ్ నమ్మకం, ఐక్యత, సమాజ సేవకు గుర్తు. మీ పర్యటన సద్భావన, సద్గుణాల సందేశాన్ని మరింత బలోపేతం చేసింది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు.

దీంతో పాటు న్యూజిలాండ్‌లోని భారతీయ సమాజానికి ప్రధాని లక్సన్ మద్దతును కూడా మెచ్చుకున్నారు. గుడిలో ప్రధాని మంచి ఆరోగ్యం, కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, న్యూజిలాండ్ శాంతిగా, అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

''అక్షర్‌ధామ్‌కు రావడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఈ గొప్ప గుడి, దాని ఆధ్యాత్మికత నిజంగా స్ఫూర్తిదాయకం. న్యూజిలాండ్ నుండి వచ్చిన వ్యాపార, సమాజ ప్రతినిధి బృందంతో ఇక్కడకు రావడం చాలా గౌరవంగా ఉంది'' అన్నారు న్యూజిలాండ్ ప్రధాని. 2023లో ఆక్లాండ్‌లో BAPS సమాజంతో జరిగిన సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ వెల్లింగ్టన్‌లో కొత్త గుడి తెరవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ప్రధాని లక్సన్ సోషల్ మీడియాలో భారతీయ సమాజం చేసిన సాయాన్ని మెచ్చుకుంటూ ఇలా రాశారు ''న్యూజిలాండ్‌లో హిందూ సమాజం చాలా పెద్ద సాయం చేసింది. ఈ రోజు ఢిల్లీలో న్యూజిలాండ్‌లోని చాలా మంది కివీ-ఇండియన్లకు పవిత్ర స్థలమైన BAPS స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ గుడిలో ప్రార్థన చేశాను. భారతీయ సమాజం న్యూజిలాండ్‌ను సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసింది. మీ సాయాన్ని మేము ఎంతగానో మెచ్చుకుంటాం. BAPS న్యూజిలాండ్‌లో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ముందుంది BAPS స్వామినారాయణ్ సంస్థ న్యూజిలాండ్‌లో ఆక్లాండ్, హామిల్టన్, రోటోరువా, క్రైస్ట్‌చర్చ్, ఇప్పుడు వెల్లింగ్టన్‌లో తన సేవలను అందిస్తోంది. ఈ సంస్థ ఆధ్యాత్మిక, యువజన, సేవా కార్యక్రమాలతో పాటు ఫుడ్ డ్రైవ్, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రచారం, విపత్తు సహాయ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటోంది'' అంటూ కొనియాడారు.