Asianet News TeluguAsianet News Telugu

New Year 2020: అందరికంటే ముందే 2020లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్

న్యూజిలాండ్ వాసులు ప్రపంచంలో అందరికంటే ముందే కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక్కడి ఛాధమ్ దీవుల్లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. 

New Year Celebrations began in newzealand
Author
New Zealand, First Published Dec 31, 2019, 4:48 PM IST

న్యూజిలాండ్ వాసులు ప్రపంచంలో అందరికంటే ముందే కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక్కడి ఛాధమ్ దీవుల్లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చి, ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Also Read:astrology 2020: న్యూ ఇయర్ లో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందంటే...

వీరికంటే ముందే పసిఫిక్ మహా సముద్రంలోని సమోవా, టోంటా, కిరిబాటి దీవుల్లో నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. దాదాపు గంట తర్వాత న్యూజిలాండ్ ప్రజలు కొత్త ఏడాదిని ఆహ్వానించారు. 

భారత్ కంటే ఐదున్నర గంటల ముందుగా ఆస్ట్రేలియాలోని కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటుంది. ముఖ్యంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్దకు లక్షలాది మంది చేరుకుని న్యూఇయర్ వేడుకల అంబరాన్నంటేలా జరుపుకుంటారు.

Also Read:Astrology 2020: కొత్త ఏడాదిలో రాశులవారీగా మీ వృత్తి, ఉద్యోగాలు ఇలా...

జపాన్ సైతం మనకంటే మూడు గంటలు ముందే 2020లోకి అడుగుపెట్టింది. ఇక భారతదేశం కంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా 43 దేశాలు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios