Asianet News TeluguAsianet News Telugu

New Ebola virus : కాంగోలో కొత్త ఎబోలా వైర‌స్.. ఒక‌రు మృతి..

కొత్త కొత్త వైరస్ లు ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ.. మరో పాత వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఎబోలా జాతికి చెందిన మరో కొత్త వైరస్ కేసును కాంగో దేశంలో గుర్తించారు. 

New Ebola virus in Congo.. One person died..
Author
First Published Aug 23, 2022, 12:02 PM IST

కాంగోలో కొత్త ఎబోలా వైర‌స్ వెలుగులోకి వ‌చ్చింది. తూర్పు నగరమైన బెనిలో ఈ కేసును నిర్ధారించారు. సెంట్రల్ ఆఫ్రికన్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింద‌ని వార్తా సంస్థ PTI సోమవారం తెలిపింది. జూలై చివరిలో బెని ఆసుపత్రిలో చేరిన 46 ఏళ్ల మ‌హిళ ఆగస్టు 15వ తేదీన మ‌ర‌ణించింది. అయితే గోమాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్‌లోని ల్యాబ్ సోమవారం నిర్వహించిన పరీక్షలో ఆమె మ‌ర‌ణానికి ఎబోలా జైర్ జాతి వైర‌స్ కార‌ణం అని తేలింది. 2018 నుండి 2020 వరకు ఇటురి, నార్త్ కివు ప్రావిన్స్‌లలో కాంగో 10వ వ్యాప్తికి ఇది జన్యుపరంగా సంబంధం కలిగి ఉందని నిర్ధార‌ణ అయ్యింది. వీటి వ‌ల్ల 2,000 మందికి పైగా మ‌ర‌ణించారు.

చెల్లెలిపై అత్యాచారం.. ఫిర్యాదు చేశాడని అన్న హత్య !? ఉత్తరప్రదేశ్ లో దారుణం..

బెనిలోని తమ బృందం ఈ వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయిన వ్య‌క్తికి  గౌరవప్రదమైన అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించింద‌ని, రోగి ఉన్న హాస్పిటల్ ను కూడా శానిటైజ్ చేసింద‌ని ఆ దేవ మంత్రిత్వ శాఖ తెలిపింది.  అయితే 130 కంటే ఎక్కువ హై-రిస్క్ కాంటాక్ట్‌లను గుర్తించామ‌ని, అందులో 71 మంది ఆచూకీ ల‌భించింద‌ని, మిగిలిన వారి జాడ తెలియ‌రాలేద‌ని మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ వైర‌స్ ప‌ట్ల ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌శాంతంగా ఉండాల‌ని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్ర‌జ‌లంద‌రూ పరిశుభ్ర‌త పాటించాల‌ని సూచించింది. 

ఏమిటీ ఎబోలా వైర‌స్.. ?
ఎబోలా వైరస్ వ్యాధి (EVD) దీనిని గతంలో ఎబోలా హెమరేజిక్ ఫీవర్ అని పిలిచేవారు. ఇది తీవ్రమైన, ప్రాణాంత‌క‌మైన వ్యాధి. ఇది మానవులను, ఇతర జీవుల‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వైరస్గ బ్బిలాలు, పందికొక్కులు, మానవేతర ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. త‌రువాత ఈ వ్యాధి సోకిన వ్య‌క్తుల ర‌క్తం, అవయవాలు, ఇతర శారీరక ద్రవాలు, ఉపరితలాలను ప్ర‌త్య‌క్షంగా తాక‌డం వ‌ల్ల ఇత‌ర జ‌నాభాకు వ్యాపిస్తుంది. 

ఎనిమిదేళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం.. గొంతు కోసి, ముఖాన్ని ఛిద్రం చేసి.. ఓ కసాయి దారుణం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. సగటు EVD కేసు మరణాల రేటు దాదాపు 50 శాతం. మొదటి ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి 1976లో మధ్య ఆఫ్రికాలోని మారుమూల గ్రామాలలో, ఉష్ణమండల వర్షారణ్యాలకు సమీపంలో నమోదైంది. పశ్చిమ ఆఫ్రికాలో 2014-2016 వ్యాప్తి వైరస్ మొదటిసారిగా గుర్తించిన‌ప్పటి నుంచి ఇది అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన వ్యాధిగా గుర్తిస్తున్నారు. టెరోపోడిడే కుటుంబానికి చెందిన పళ్ల గబ్బిలాలు సహజ ఎబోలా వైరస్ కార‌కాలుగా భావిస్తున్నారు. 

ఒడిశాలో భీక‌ర వ‌ర‌ద‌లు.. 9 లక్షల మందిపై ప్ర‌భావం.. 38 మంది మృతి.. ప‌లు రాష్ట్రాల్లోనూ వ‌ర్ష బీభ‌త్సం

ఎబోలా వైరస్ వ్యాధి లక్షణాలు?
జ్వరం, అలసట, కండరాలు, నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి ఈ వ్యాధి ప్ర‌ధాన ల‌క్ష‌ణాలు. దీంతో పాటు వాంతులు, విరేచనాలు, దద్దుర్లు, మూత్రపిండాలు, బ‌ల‌హీన‌మైన కాలేయ పనితీరు లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత, బాహ్య రక్తస్రావం కూడా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు చిగుళ్ళ నుండి కారటం, మలంలో రక్తస్రావం ఉండ‌టం వంటి లక్ష‌ణాలు ఉంటాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios