వీడి దుంపతెగ.. నగ్నంగా దొంగతనానికి వచ్చి.. పోలీసు బండినే కొట్టేశాడు...వైరల్ వీడియో
రోడ్ల మీద నగ్నంగా తిరుగుతూ.. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులకు ఝలక్ ఇచ్చాడు. అంతలోనే మరో కారుకు ఢీ కొట్టి, ఆస్పత్రి పాలయ్యాడో దొంగ.
లాస్ వెగాస్ : అమెరికాలోని లాస్ వేగాస్ ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఒంటిమీద నూలపోగు లేకుండా పోలీసుల కంట పడ్డాడు. అతడిని ప్రశ్నించేలోగానే.. పోలీసుపై దాడిచేసి పెట్రోలింగ్ వాహనంతో ఉడాయించాడు. పెట్రోలింగ్ కారుతో వెడుతూ మరో వాహనాన్ని ఢీకొట్టాడు.
న్యూయార్క్ పోస్ట్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెడితే... మంగళవారం రాత్రి లాస్ వెగాస్ మెట్రోపాలిటన్ పోలీసులకు బ్లూ డైమండ్ రోడ్ లో ఓ వ్యక్త నగ్నంగా తిరుగుతున్నాడని కాల్ వచ్చింది.
Ibrahim Biari : హమాస్ కు భారీ షాక్.. ఇబ్రహీం బియారీని హతమార్చిన ఇజ్రాయెల్.. ఆయన ఎవరంటే ?
వెంటనే స్పందించిన పోలీసులు ఆ వ్యక్తి తిరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అతనితో పోలీసుకు వాగ్వాదం జరిగింది. ఆ తరువాత ఆ వ్యక్తి పోలీసును కొట్టి.. పెట్రోలింగ్ వాహనంలో పారిపోయాడు. ఇదంతా సమీపంలోని సీసీ కెమెరాలో నమోదయ్యింది. వింత సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
పెట్రోలింగ్ వాహనాన్ని దొంగిలించిన తరువాత రోడ్ల మీద హై-స్పీడ్ తో వెడుతూ మరొక కారును ఢీకొట్టాడు. ఆ ఎస్‌యూవీలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అత్యవసర చికిత్స కోసం యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నగ్నంగా ఉన్న వ్యక్తిని 29 ఏళ్ల క్లైడ్ కాబులిసన్‌గా గుర్తించారు, అతను కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.