2021లో పలు అభియోగాలతో సైనిక నిర్భంధంలో ఉన్న ఆంగ్ సాన్ సూకీకి విముక్తి లభించింది. ఆమెకు సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రస్తుతం ఆమె జైలు నుంచి విడులైనప్పటికీ గృహ నిర్బంధంలో ఉన్నారు.
మయన్మార్ పౌర నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి ఐదు నేరాలకు గాను మిలటరీ జుంటా క్షమాభిక్ష ప్రసాదించింది. 2021లో సైనిక తిరుబాటు ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ఆమెకు మొత్తం 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి సూకీ సైనిక నిర్బంధంలో ఉన్నారు. అక్కడి ప్రభుత్వ అధికారిక మీడియా వివరాల ప్రకారం..ప్రస్తుతం ఆమెను జైలు నుండి గృహ నిర్బంధానికి తరలించారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.
ఢిల్లీ ఆజాద్ పూర్ మండీలో రాహుల్ గాంధీ సందడి.. తెల్లవారుజామున చిరు వ్యాపారులతో ముచ్చట్లు
అయితే గతంలోనే సూకీ తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. రెచ్చగొట్టడం, ఎన్నికల మోసం, అవినీతి వంటి అభియోగాలపై ఆమె అప్పీల్ చేస్తున్నారు. అయితే గతవారమే సూకీని జైలు నుంచి గృహ నిర్బంధంలోకి తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి. అనారోగ్యం కారణంగానే ఈ బదిలీ జరిగిందని ప్రచారం జరిగినా, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని జైలు గార్డులు హామీ ఇచ్చారు.
అత్యవసర పరిస్థితిని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు మయన్మార్ జుంటా సోమవారం ప్రకటించింది. ఈ పొడిగింపుతో 2023 ఆగస్టులో జరగాల్సిన ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఆమెపై నమోదైన ఐదు నేరాల నుంచి ఆ నేతకు క్షమాభిక్ష ప్రసాదించినప్పటికీ, ఆమె గృహ నిర్బంధం నుంచి విముక్తి పొందలేరని జుంటా సన్నిహిత వర్గాలు తెలిపాయి.
గురుగ్రామ్ లో మత ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణలో ముగ్గురి మరణం.. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు..
1989లో సూకీని తొలిసారి గృహనిర్బంధంలో ఉంచారు. సైనిక పాలనలో ఉన్న బర్మాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఆమె చేసిన నిరంతర కృషికి 1991 లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2010లో గృహ నిర్బంధం నుంచి పూర్తిగా విడుదలైన ఆమె 2015లో మయన్మార్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, 2021లో సైనిక తిరుగుబాటు తిరిగి రావడంతో ఈ నేతను అరెస్టు చేశారు.
