గత ఎనిమిదేళ్లుగా భద్రతా సిబ్బంది అతని కోసం వేటాడుతున్నారు. అయితే ఓ సాధారణ లెక్కల మాస్టారు జమ్మూకశ్మీర్‌కు చెందిన టాప్ మిలిటెంట్లలో ఒకడిగా మారడం సైన్యాన్ని సైతం విస్మయపరుస్తోంది
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూను హతమార్చడం భారత సైన్యం అతి పెద్ద విజయం సాధించినట్లేనని రక్షణరంగ నిపుణులు అంటున్నారు.
గత ఎనిమిదేళ్లుగా భద్రతా సిబ్బంది అతని కోసం వేటాడుతున్నారు. అయితే ఓ సాధారణ లెక్కల మాస్టారు జమ్మూకశ్మీర్‌కు చెందిన టాప్ మిలిటెంట్లలో ఒకడిగా మారడం సైన్యాన్ని సైతం విస్మయపరుస్తోంది.
Also Read:గుజరాత్ లో కరోనా వ్యాప్తికి 'నమస్తే ట్రంప్ ప్రోగ్రామే' కారణం: కాంగ్రెస్ ఆరోపణ
రియాజ్ నైకూ పంజ్‌గామ్‌లోని నైకూ మొహల్లాలో 1985లో జన్మించాడు. నలుగురు సంతానంలో అతను రెండో వాడు. చదువులో ముందుండే నైకూ ఇంటర్‌లో 464 మార్కులు సాధించి ఇంజనీర్ కావాలని భావించాడు.
కానీ డిగ్రీ అయిపోగానే ఓ ప్రైవేట్ స్కూల్‌లో లెక్కల మాష్టారుగా చేరాడు. పేద విద్యార్ధులకు ఉచితంగా తరగతులు కూడా చెప్పేవాడు. 2012లో ఓ కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడి నుంచి వెళ్లొచ్చిన తర్వాత నైకూలో మార్పు వచ్చింది.
ఆ తర్వాత ఉగ్రవాదంపై ఆకర్షితుడై 2012 జూన్ 6న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. నైకూపై ఇప్పటి వరకు 11 కేసులు ఉన్నాయి. గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న అతని తలపై రూ.12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో నైకూ యాక్టీవ్‌గా ఉన్నాడు.
Also Read:ఛత్తీస్‌ఘడ్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్: ఏడుగురు కార్మికులకు అస్వస్థత
2016 జూలైలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బుర్హాన్ వని మరణించాక రియాజ్.. డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. తన ఉపన్యాసాలతో పలువురు యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షించేలా చేశాడు.
దీనికి తోడు టెక్నాలజీపై పట్టున్న అతను ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. ఈ క్రమంలో అతని స్వగ్రామంలోనే రియాజ్ ఉన్నాడన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు అతనిని గత మంగళవారం మట్టుబెట్టాయి.
