యూకేలో పార్క్ చేసి ఉన్న సూపర్‌యాచ్‌లో మంటలు చెలరేగాయి. ఇది చాలా ఖరైదైన సూపర్ యాచ్. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ మారాయి.
యూకేలోని డెవాన్ హార్బర్‌లో లంగరు వేసిన లగ్జరీ సూపర్‌యాచ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 8,000 లీటర్ల ఇంధనం ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ ప్రాంతంలో విపరీతంగా పొగ అలుముకుంది. మంటలు వేగంగా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనపై డెవాన్ & కార్న్‌వాల్ పోలీసులు స్పందించారు. అత్యవసర సేవలు ప్రస్తుతం స్పందిస్తున్నాయని ట్వీట్ చేశారు. ‘‘ మంట, పొగల కారణంగా ఆ ప్రాంతంలోని తలుపులు, కిటికీలు మూసివేయాలని మేము ప్రజలను కోరుతున్నాము" అని ట్వీట్ లో పేర్కొన్నారు.
బెర్ముడా ట్రయంగిల్‌కు టూర్.. విచిత్ర ఆఫర్.. ‘షిప్ తిరిగి రాకుంటే రిఫండ్ చేస్తాం’
అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా వీడియోలు ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి. వీటిల్లో ఆ అగ్ని ప్రమాదం తీరు స్పష్టంగా కనిపించింది. దట్టమైన నల్లటి పొగలు విపరీతంగా పైకి లేచాయి. మంటలు కూడా క్లారిటీగా కనిపించాయి. కాగా అగ్నిప్రమాదం సంభవించిన 85 అడుగుల సూపర్‌యాచ్ విలువ 7.5 మిలియన్ డాలర్లు (6.5 మిలియన్ పౌండ్లు) ఉంటుందని, అదంతా అగ్నికి ఆహుతి అవుతోందని స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
స్థానిక మీడియా విడుదల చేసిన ప్రకటనలో డెవాన్, కార్న్‌వాల్ పోలీసులు ఎవరూ గాయపడినట్లు నివేదించబడలేదు. ‘‘ మెరీనాలో పడవలో మంటలు చెలరేగినట్లు సమాచారం రావడంతో ఈ రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు టోర్క్వేలోని ప్రిన్సెస్ పియర్ వద్దకు పోలీసులను పిలిపించారు. పడవ బాగా దిగిందని, మూరింగ్ నుండి విరిగిపోయిందని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పుడు ఫైర్ సిబ్బంది శ్రమ వల్ల సురక్షితంగా ఉంద ’’ అని పేర్కొంది.
అయితే మంటలు చెలరేగిన కొద్దిసేపటికే పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు గుర్తించారు. ఒక సాక్షి డెవాన్ లైవ్‌తో మాట్లాడుతూ.. ‘‘ తాళ్లు కాలిపోయాయి దీంతో అది పీర్‌లోకి కూరుకుపోయింది. అగ్నిమాపక సిబ్బంది ట్రాలీలు, పంపులను పాంటూన్‌ల వెంట తీసుకెళ్లారు కానీ నీరు చేరలేదు. కొంతమంది పీర్ మరొక చివరలో చిక్కుకున్నారు. తిరిగి రాలేరు. అగ్నిమాపక సిబ్బంది పీర్ వెంట నడుస్తున్నారు. ఇప్పటికీ భారీ మంటలు చెలరేగుతున్నాయి ’’ అని సాక్షి పేర్కొన్నారు. కాగా మెట్రో యూకే తెలిపిన వివరాల ప్రకారం..ఈ పడవ రెండెజ్వస్ అని పిలువబడే ప్రిన్సెస్ పడవ లాగా కనిపిస్తుంది. 2010లో ప్లైమౌత్ లో ఖరీదైన పడవను నిర్మించారని మీడియా నివేదికలు తెలిపాయి.
