మార్క్ జుకర్ బర్గ్ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఫేస్‌బుక్‌తో మొదలైన మార్క్ ప్రస్థానం ప్రస్తుతం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అన్నింటినీ కలుపుకొని మెటా వరకు ఎదిగింది. కాగా తాజాగా మార్క్ తన మరో రూపాన్ని చూపించారు. ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించని లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు...
కొన్ని వేల కోట్లకు అధిపతి, ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మెటా సంస్థలకు సీఈఓ.. అయినా సింపుల్‌గా ఉంటారు మార్క్. ఎప్పుడు చూసినా ఓ టీషర్ట్ ప్యాంట్‌తో దర్శనమిస్తుంటారు. అయితే తాజాగా ఇందుకు భిన్నంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన భార్య ప్రిసిల్లా చాన్ పుట్టిన రోజు వేడుకల్లో జుకర్ బర్గ్ రచ్చ రచ్చ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల మార్క్ భార్య ప్రిసిల్లా చాన్ 40వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన జుకర్‌బర్గ్ తన పూర్తి ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ఆకట్టుకున్నారు. మొదట ఫార్మల్ లుక్‌లో ఏదో సమావేశానికి హాజరైనట్లు రడీ అయి స్టేజ్ పైకి వచ్చారు. అయితే వెంటనే అక్కడున్న వారు అతను ధరించిన కోర్టును విప్పేశారు. దీంతో జుకర్ తన భార్య కోసం చేసిన అసలు సర్ప్రైజ్ బయట పడింది. ప్రముఖ సింగర్ బెన్సన్ బూన్ గ్రామీ లుక్‌లోకి మారిపోయిన జుకర్ మైక్ చేతబట్టి పాటలతో అదరగొట్టాడు.
అంతటితో ఆగకుండా భార్య ముందు చిందులు వేశాడు. 'స్వారీ ఐయామ్ హియర్ ఫర్ సమ్‌వన్ ఎల్స్' అనే పాటకు చిందులు వేస్తూ హై ఎనర్జీతో డ్యాన్సు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా షేర్ చేసిన జుకర్స్ బర్గ్.. 'నా భార్యకు 40 ఏళ్లు ఒక్కసారి మాత్రమే వస్తాయి! ఈ స్పెషల్ మూమెంట్ కోసం సింగర్ బెన్స్ బూన్‌కు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చారు. ఎప్పుడూ సింపుల్ లుక్స్‌లో సైలెంట్‌గా కనిపించే జుకర్ బర్గ్ ఇలా ఒక్కసారిగా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. భార్య కోసం ఈ మాత్రం చేయడంలో తప్పేం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.