Asianet News TeluguAsianet News Telugu

ప్రయాణికులను కత్తితో బెదిరిస్తూ ట్రైన్‌కు నిప్పు.. కిటికీల్లో నుంచి జనాలు బయటకు..

జపాన్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తితో Knifeతో బెదిరిస్తూ Train లోకి ఎక్కాడు. ఓ రకమైన లిక్విడ్‌ను బోగీలో పిచికారి చేసి నిప్పు అంటించాడు. ప్రయాణికులతో ప్రాణభయంతో పరుగులు పెట్టారు. పది బోగీల ఈ ట్రైన్‌లో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.

man along with knife sets train on fire in japan
Author
Tokyo, First Published Oct 31, 2021, 6:45 PM IST

టోక్యో:  జపాన్‌లో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో ప్రయాణికులను బెదిరిస్తూ ఓ ట్రైన్‌లోకి ఎక్కాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న ఓ లిక్విడ్‌ను బోగీలో పిచికారీ చేశాడు. అనంతరం నిప్పు అంటించాడు. దీంతో హడలిపోయిన ప్రయాణికులు పరుగులు పెట్టారు. ట్రైన్ నుంచి బయటపడటానికి విశ్వప్రయత్నాలు చేశారు. కిటికీల గుండా బయటకు రావడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డట్టు తెలిసింది. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

Fire నుంచి తప్పించుకోవడానికి ట్రైన్ కిటికీల్లో నుంచి బయటకు రావడానికి ప్రయాణికులు ప్రయత్నించారు. బయట ఉన్నవారు వారిని పదిలంగా పట్టుకుని సులువుగా బయటపడానికి సహకరించారు. స్టేషన్ మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఘటనకు సంబంధించిన ఓ వీడియోలో అరుపులు, పరుగులు కనిపించాయి. Emergency సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. ట్రైన్ వైపు వేగంగా కదిలి వెళ్తున్న ఎమర్జెన్సీ సిబ్బంది ఓ వీడియో కనిపించారు. 

Also Read: పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు!

Japanలో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కెయియో రైల్వే లైన్‌పై కొకుర్యో స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. కత్తితో బెదిరింపులకు పాల్పడుతూ నిప్పు పెట్టిన దుండగుడి వయసు 20ఏళ్లు ఉంటాయని అంచనా వేశారు.

పోలీసులు సమాచారం అందుకుని వెంటనే స్పాట్‌కు తరలివచ్చారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసినట్టు మరో రిపోర్టు తెలిపింది. ట్రైన్ మొత్తంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను పంప్ చేసినట్టుగా కొందరు చెప్పారు. ఈ విషయంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జపాన్‌లో నూతన ప్రధానమంత్రి కోసం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇవి ఆదివారమే ముగిశాయి. అటు ఎన్నికలు ముగియగానే, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. 

Also Read: కదులుతున్న ట్రైన్‌లో యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన దొంగలు.. ఆయుధాలతో బెదిరించి దారుణం

సాధారణంగా జపాన్‌లో హింసాత్మక ఘటనలు జరగడం చాలా స్వల్పం. ఎందుకుంటే ఇక్కడ కఠినమైన గన్ చట్టాలు అమల్లో ఉన్నాయి. తుపాకులను కొనుగోలు చేయడం ఇక్కడ అంత సులభం కాదు. 

ఇక్కడ హింసాత్మక ఘటనలు, దారుణాల రేటు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ భూకంపాల రేటు ఎక్కువగా ఉంటుంది. జపాన్‌లో భూకంపాలు తరుచూ చోటుచేసుకుంటూ ఉంటాయి. సునామీ ముప్పు అధికమే. 2011లో భీకర సునామీ సంభవించింది. ఈ సునామీలో కనీసం 19 వేల పై చిలుకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందింది.

Follow Us:
Download App:
  • android
  • ios