మలేసియా మంత్రివర్గంలో తొలి సిక్కు మంత్రి ఈయనే

First Published 23, May 2018, 11:22 AM IST
Malaysia has appointed its first Sikh minister
Highlights

మలేసియా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న తొలి ఇండో- మలేసియా సిక్కు వ్యక్తిగా గోవింద్‌సింగ్‌ దేవ్‌ రికార్డు సృష్టించారు.

కౌలాలంపూర్‌: మలేసియా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న తొలి ఇండో- మలేసియా సిక్కు వ్యక్తిగా గోవింద్‌సింగ్‌ దేవ్‌ రికార్డు సృష్టించారు. పక్కాటన్ హరప్పన్ సంకీర్ణ మంత్రివర్గంలో గోవింద్‌సింగ్‌ సమాచార, మల్టీమీడియా శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

గోవింద్‌సింగ్‌తో పాటు డెమోక్రాటిక్‌ యాక్షన్‌ పార్టీకి చెందిన మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎం.కిలసేగరన్‌ మానవ వనరులశాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. 

గోవింద్‌సింగ్‌ మలేసియాలోని పుచుంగ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోవింద్‌ తండ్రి కర్పాల్‌ సింగ్‌ మలేసియాలో ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త.

గోవింద్‌సింగ్‌ 2008లో మొదటిసారి మలేసియా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2013, 2018లో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.  మలేసియా జనాభాలో లక్ష జనాభా సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారున్నారు.

loader