Asianet News TeluguAsianet News Telugu

లాస్ ఏంజిల్స్ చ‌ర్చిలో కాల్పులు.. ఒక‌రు మృతి.. 5 గురికి గాయాలు

అమెరికాలో మళ్లీ కాల్పులు జరిగాయి. లాస్ ఏంజిల్స్ లోని ఓ చర్చిలో దుండగుడు ప్రవేశించి గన్ తో షూట్ చేయడంతో ఒకరు చనిపోయారు. న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్ లో జరిగిన కాల్పుల్లో 10 మంది చనిపోయిన ఘటన మరవకముందే ఇది చోటు చేసుకుంది. 

Los Angeles church shooting: One killed, 5 injured
Author
New Delhi, First Published May 16, 2022, 10:16 AM IST

యూఎస్ లాస్ ఏంజిల్స్ సమీపంలోని చర్చిలో కాల్పులు క‌ల‌క‌రం రేపాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒకరు మరణించారు. న‌లుగురు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఒకరు స్పల్పంగా గాయాలపాలయ్యారు. న్యూయార్క్ రాష్ట్రంలోని ఓ సూప‌ర్ మార్కెట్ లో ఒక దుండ‌గుడు 10 మందిని కాల్చి చంపిన ఒక రోజు తర్వాత ఇది చోటు చేసుకుంది. 

‘‘లాస్ ఏంజిల్స్ చ‌ర్చిలో జ‌రిగిన కాల్పుల్లో ఒక‌రు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతి చెందారు. న‌లుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.’’ అని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. మరో వ్య‌క్తికి స్వల్పంగా గాయాలు అయ్యాయని పేర్కొంది. ఇందులో బాధితులందరూ పెద్దవారేనని, చిన్న పిల్లలు ఎవరూ లేరని డిపార్ట్‌మెంట్ పేర్కొంది.  

హెల్మెట్ కు కెమెరా అమ‌ర్చి.. ఆర్మీ డ్రెస్ వేసుకొని 10 మందిని కాల్చిచంపిన దుండ‌గుడు..

ఆదివారం మధ్యాహ్నం 1:26 గంటలకు జెనీవా ప్రెస్బిటేరియన్ చర్చి నుండి అత్యవసర కాల్ వచ్చిందని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ తెలిపింది. ‘‘ మేము ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అతడి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం.’’ అని షెరీఫ్ డిపార్ట్‌మెంట్ తరువాతి పోస్ట్ లో తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది, పారామెడిక్స్ సిబ్బంది ఘటనా స్థలంలో ఉన్నారని, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారని, బాధితుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లిస్తున్నార‌ని చెప్పింది. 

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బ్లడ్ క్యాన్సర్..!

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో బ‌య‌టకు వ‌చ్చాయి. ఇందులో చ‌ర్చి బ‌య‌ట ఎమ‌ర్జెన్సీ వెహిక‌ల్స్ వ‌ర‌సుగా పెట్టి ఉంచిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. ఈ కాల్పులపై ప‌రిస్థితిని పర్యవేక్షించేందుకు స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ కార్యాలయం తెలిపింది. ‘‘ ఎవరూ తమ ప్రార్థనా స్థలాలకు వెళ్లేందుకు భయపడాల్సిన అవసరం లేదు. మా ఆలోచనలు బాధితులపైనే ఉన్నాయి ’’ అని ఆ ఆఫీసు ట్వీట్ చేసింది.

వాషింగ్టన్‌లోని ఆరెంజ్ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ కాంగ్రెస్ మహిళ కేటీ పోర్టర్, కాల్పులను ‘భంగ పరిచే, కలవరపరిచే వార్తలుగా అభివర్ణించారు. బఫెలోలో సామూహిక కాల్పులు జరిగిన ఒక రోజులోపై ఇది జరగడం విచారకరమని అన్నారు. కాగా.. గత కొన్నేళ్లుగా అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గన్ వయొలెన్స్ ఆర్కైవ్ వెబ్ సైట్ ప్రకారం.. ప్ర‌తీ ఏడాది తుపాకీ హింస కారణంగా సుమారు 40,000 మరణాలు నమోదవుతున్నాయి. ఈ ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios