Asianet News TeluguAsianet News Telugu

హెల్మెట్ కు కెమెరా అమ‌ర్చి.. ఆర్మీ డ్రెస్ వేసుకొని 10 మందిని కాల్చిచంపిన దుండ‌గుడు..

యూఎస్ఏ లో కాల్పుల సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ కాల్పుల్లో ప్ర‌తీ ఏడాది వేలాది మంది మ‌ర‌ణిస్తున్నారు. తాజాగా న్యూయార్క్ సిటీలో ఓ దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. 

At least 10 people have been killed in a shooting at a Buffalo supermarket in New York
Author
New York, First Published May 15, 2022, 7:25 AM IST

న్యూయార్క్ బఫెలో నగరంలోని ఓ సూప‌ర్ మార్కెట్ లో ఓ దుండ‌గుడు విచ‌క్షణా ర‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. అయితే ఈ కాల్పులు జ‌రిపే స‌మ‌యంలో దుండ‌గుడు ఆర్మీ త‌ర‌హా డ్రెస్ వేసుకొని ఉన్నాడు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ ధ‌రించాడు. అత‌డు త‌ల‌కు పెట్టుకున్న హెల్మెట్ కు కెమెరా కూడా అమ‌ర్చుకున్నాడు. 

Andrew Symonds dies: క్రీడాలోకంలో మ‌రో విషాదం.. ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఇక‌లేరు

కాల్పులు జ‌రుపుతున్న స‌మ‌యంలో పోలీసులు అక్క‌డికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ఈ కాల్పుల ఘటనను విద్వేషపూరిత నేరంగా, జాతి ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదంగా అభివ‌ర్ణించి దర్యాప్తు చేస్తోంది. నిందితుడిని అధికారులు శ‌నివారం సాయంత్రం ప్ర‌శ్నించారు. 

కాల్పులు జ‌రిపిన నిందితుడు త‌న హెల్మెట్ కు కెమెరా ధ‌రించి ఉన్నాడ‌ని, కాబ‌ట్టి ఈ ఘ‌ట‌న‌ను అత‌డు లైవ్ టెలికాస్ట్ చేసి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో పార్కింగ్ స్థ‌లంలో ఐదు మృతదేహాలు లభ్యమైనట్లు ఏఎఫ్ బీ వార్తా సంస్థ తెలిపింది. 

పని ప్రదేశాల్లో పురుషులను ‘బట్టతల’ అని పిలవడం లైంగిక వేధింపే.. ఇంగ్లండ్ ట్రైబ్యునల్ తీర్పు...

బఫెలో మేయర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. దుండ‌గుడు సూప‌ర్ మార్కెట్ లో కాల్పులు జ‌ర‌పడానికి గంటల తరబడి ప్రయాణించాడు. ఎందుకంటే సూపర్ మార్కెట్ బఫెలో డౌన్ టౌన్ నుంచి మూడు మైళ్ళ దూరంలో ఉంది. పశ్చిమ న్యూయార్క్ లో US-కెనడా సరిహద్దు వెంబడి ఉంది. అయితే నేర‌స్తుడు ఎందుకు ఇలాంటి దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడో, అత‌డి ల‌క్ష్యం ఏమిటో ఇంకా తెలియాల్సి ఉంది. 

నెల రోజుల్లో న్యూయార్క్ లో జరిగిన రెండో కాల్పుల ఘటన ఇది. ఏప్రిల్ 12వ తేదీన న్యూయార్క్ లోని స్వ‌యంపాలిత ప్రాంతమైన బ్రూక్లిన్ లోని సబ్ వే స్టేష‌న్ లో జరిగిన కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. దాడి జరిగిన రెండు రోజుల తరువాత ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన 62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్. జేమ్స్ ను మాన్హాటన్ నుండి అదుపులోకి తీసుకున్నారు.

NATO: నాటోలో చేరుతామంటూ ఫిన్‌లాండ్, స్వీడ‌న్ ప్ర‌క‌ట‌న‌.. మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌న్న ట‌ర్కీ !

గత కొన్నేళ్లుగా అమెరికాలో సామూహిక కాల్పుల ఘటనలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గన్ వయొలెన్స్ ఆర్కైవ్ వెబ్ సైట్ ప్రకారం.. ప్ర‌తీ ఏడాది తుపాకీ హింస కారణంగా సుమారు 40,000 మరణాలు నమోదవుతున్నాయి. ఈ ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios