యూనిఫాంలోనే మహిళకు ముద్దులు.. పోలీసు కారు వెనుక సీట్లోకి ఎక్కి రచ్చ...వీడియో వైరల్ కావడంతో సస్పెండ్..
పోలీసు వాహనంలో మహిళతో గడిపిన ఓ పోలీసును అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది.

అమెరికా : పోలీసులు ఎక్కడైనా పోలీసులే.. సందు దొరికితే చాలు.. వాడుకుంటారు. అలాంటి ఓ పోలీసుకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అమ్మాయి కనిపించగానే వంకర్లు తిరిగిపోతూ.. డ్యూటీలో ఉన్నానని కూడా చూడకుండా.. ఆమె మీద ముద్దులు కురిపించాడు. అంతేనా.. తన పోలీస్ వాహనంలోనే ఆమెతోపాటు వెనక సీట్లో ఎక్కేశాడు.
దీన్నంతా రోడ్డుకు మరోవైపు ఉన్న కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ అయ్యింది. దీనికి సంబందించిన వివరాల్లోకి వెడితే.. యుఎస్‌లోని ఒక పోలీసు అధికారి ఒక మహిళను ముద్దుపెట్టుకుని, తన స్క్వాడ్ కారు వెనుక ఆమెతో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సస్పెండ్ చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
ప్రిన్స్ జార్జ్ కౌంటీ పోలీసు అధికారి, ఫ్రాన్సెస్‌కో మార్లెట్.. ఓ పార్క్ దగ్గర తన పోలీసు వాహనాన్ని నిలిపాడు. అక్కడే ఓ స్త్రీని కౌగిలించుకుని ముద్దుపెట్టుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ తరువాత ఆ మహిళ ఆ అధికారి చేతిని పట్టుకుని, కారు వెనుక సీట్లోకి తీసుకెళ్లింది. అతను కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఆమెతోపాటు కారు ఎక్కేశాడు.
వీడియో చిత్రీకరించిన వ్యక్తి మాట్లాడుతూ... ఆ మహిళ, పోలీసు ఇద్దరూ ఆ వాహనంలో దాదాపు 40 ని.లు గడిపారని తెలిపారు. ఆ తరువాత ఇద్దరూ విడివిడిగా పార్క్ నుండి బయలుదేరి వెళ్లిపోయారని చెప్పుకొచ్చాడు. అమెరికాలోని ఆక్సన్ హిల్ హై స్కూల్ పక్కనే ఉన్న కార్సన్ పార్క్‌లో వీడియో చిత్రీకరించబడింది.
పోలీసు మార్లెట్, వీడియోలో ఉన్న మహిళ మధ్య సంబంధం ఏమిటో అస్పష్టంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో టిక్‌టాక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. దీంతో మార్లెట్‌ను మంగళవారం యాక్టివ్ డ్యూటీ నుండి తొలగించినట్లు డిపార్ట్‌మెంట్ తెలిపింది.
"దీనిమీద విచారణ కొనసాగుతున్నందున అతడి పవర్స్ కట్ చేశాం" అని డిపార్ట్‌మెంట్ మంగళవారం సాయంత్రం ట్వీట్ చేసింది. కాగా, మార్లెట్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. 2016లో, మార్లెట్ తన మాజీ ప్రియురాలి బిడ్డను కొట్టినందుకు వేతనం లేకుండా సస్పెండ్ చేయబడ్డాడు. గృహహింస ఆరోపణలు రావడంతో మే నెలలో ఆయనను నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు.