ఫ్లోరిడా: పెంపుడు జంతువులను కొందరు తమ ఇంట్లో సభ్యులుగా చూస్తారు. అయితే కొత్తగా తీసుకొచ్చిన ఓ కుక్కను పిల్లలు కొత్త పెళ్లికూతురిగా ఇంట్లోకి ఆహ్వానించింది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:కిచెన్‌లో అంట్లు తోముతున్న కుక్క: సోషల్ మీడియాలో ఫోటో వైరల్

ప్లోరిడాకు చెందిన ఓ కుటుంబం తమ ఇంట్లోకి కుక్క పిల్లను తీసుకొచ్చింది. అయితే కుక్క పిల్లను తమ ఇంట్లోకి ఆహ్వానించే సమయం జీవితాంతం గుర్తుండేలా చేయాలని భావించారు. ఇంటికి కొత్త కోడలు వచ్చిన సమయంలో పాటించే సంప్రదాయాలను పాటించారు.

 కొత్తగా ఇంటికి తెచ్చిన కుక్క పిల్లకు బెంజి పాటెల్ అని పేరు పెట్టారు. అంతేకాదు ఆ కుక్క పిల్లకు హారతి ఇచ్చి ఎర్రనీళ్లతో దాని అడుగులను పదిలం చేసి ఇంట్లోకి తీసుకెళ్లారు.  ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీశారు. ఈ వీడియో కు బాలీవుడ్ ప్రముఖ సినిమా కబీ ఖుషీ కబీ గమ్ పాటను జోడించారు. ఈ వీడియోను టిక్ టాక్ లో పో
స్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇదిలా ఉంటే లాక్ డౌన్ సమయంలో వంటింట్లో కుక్క అంట్లు తోముతున్న ఫోటోను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి షేర్ చేశాడు. ఈ ఫోటో కూడ వైరల్ గా మారింది. నెటిజన్లు విపరీతంగా ఈ ఫోటోపై కామెంట్స్ చేశారు.