న్యూఢిల్లీ:కిచెన్ లో కుర్చీలో కూర్చొని ఓ కుక్క అంట్లు తోముతున్న ఫోటో ఒక్కటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో కుక్క ఇంటి పనుల్లో సహాయం చేస్తోందని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ముకుల్ సింగ్ అనే వ్యక్తి వంట గదిలో అంట్లు తోముతున్న కుక్క ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు విపరీతంగా స్పందించారు.ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారింది. 

ఎప్పుడూ అది ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇక నుండి ఇంటి పనుల్లో సహాయం చేస్తేనే దానికి ఆహారం అంటూ ఆయన ఫోటోను షేర్ చేసి కామెంట్ పెట్టాడు.

ఈ ఫోటోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యలు చేశారు. కొందరు ఈ ఫోటోను చూసి నవ్వుకొంటూ జోకులు పేల్చారు. మరికొందరు మాత్రం మూగ జీవాలను వేధిస్తున్న యజమానిని శిక్షించాలని కోరుతున్నారు. 

ఇలాంటి విధేయమైన కుక్క తన పెంపుడు జంతువుగా ఉంటే తాను ఎంతో సంతోషంగా ఉంటానని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు వాట్ ఏ హెల్ప్‌ఫుల్ డాగ్ అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.మొత్తంగా ఈ కుక్క పోటో సోషల్ మీడియాను షేక్ చేసింది.