కెన్యాకు చెందిన మారథాన్ ప్రపంచ రికార్డు హోల్డర్ కెల్విన్ కిప్తుమ్ రోడ్డు ప్రమాదంలో మృతి...
కెన్యా ఓ ప్రముఖ క్రీడాకారుడిని కోల్పోయింది. రోడ్డు ప్రమాదం అతడిని బలి తీసుకుంది. పురుషుల మారథాన్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కెకెల్విన్ కిప్టమ్ (24) రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
కెన్యా : పురుషుల మారథాన్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, కెన్యాకు చెందిన కెల్విన్ కిప్టమ్ (24) తన స్వదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆదివారం పశ్చిమ కెన్యాలోని రోడ్డుపై కారులో వెడుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కెల్విన్ కోచ్, రువాండాకు చెందిన గెర్వైస్ హకిజిమానా కూడా మరణించారు.
కిప్టమ్ 2023లో మారథాన్ రన్నర్‌లలో ఒకరైన, తమ దేశానికే చెందిన ఎలియుడ్ కిప్‌చోగ్‌కి ప్రత్యర్థిగా ఎదిగాడు. గత అక్టోబరులో చికాగోలో జరిగిన మారథాన్ లో 26.1 మైళ్లు (42 కిమీ)లను కిప్టమ్ రెండు గంటల 35 సెకన్లలో అధిగమించాడు. దీంతో అప్పటివరకు కిప్‌చోగ్ పేరున్న రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ ఏడాది చివర్లో జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం కెన్యా ఎంపిక చేసిన తాత్కాలిక మారథాన్ జట్టులో ఈ ఇద్దరు అథ్లెట్లు ఎంపికయ్యారు. కెన్యా క్రీడా మంత్రి అబాబు నమ్వాంబా కిప్టమ్ కు Xలో నివాళులు అర్పిస్తూ, ఇలా వ్రాశారు : "కెన్యా ఒక ప్రత్యేక జాతి రత్నాన్ని కోల్పోయింది. దీనిమీద మాట్లాడాలంటే పదాలు దొరకడం లేదు. విషాదం" అంటూ పేర్కొన్నారు.
పసికందును ఊయలకు బదులు ఓవెన్ లో పడుకోబెట్టిన తల్లి.. తరువాత ఏమైందంటే ?
కెన్యా ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని రైలా ఒడింగా మాట్లాడుతూ దేశం "నిజమైన హీరో"ని కోల్పోయింది. "కెన్యా అథ్లెటిక్స్ ఐకాన్" కిప్టమ్ అని సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచ అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో, కిప్టమ్ "అద్భుతమైన అథ్లెట్, అతడిని చాలా మిస్ అవుతాం" అని అన్నారు.
ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం 23:00 గంటలకు (20:00 GMT) రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు ఉటంకిస్తూ ఏఎఫ్ పి వార్తా సంస్థ తెలిపింది. ప్రమాద సమయంలో కిప్టమ్ వాహనాన్ని నడుపుతున్నాడు. ఒక్కసారిగా బండి "అదుపుతప్పి బోల్తా పడింది, ఇద్దరు అక్కడికక్కడే మరణించారు" అని పోలీసులు చెప్పారు.
ఘటన సమయంలో బండిలో మరొకరు ఉన్నారు. ఆమె మహిళ గాయాలతో బయటపడింది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కిప్టమ్ రోటర్‌డ్యామ్ మారథాన్‌లో రెండు గంటలలోపే టార్గట్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని గత వారం అతని బృందం ప్రకటించింది. బహిరంగ పోటీలో ఇప్పటివరకూ ఇంత దూరాన్ని అంత తక్కువ సమయంలో ఎవ్వరూ సాధించలేదు.
కిప్టమ్ ఇద్దరు పిల్లల తండ్రి. 2022లో తన మొదటి పూర్తి మారథాన్ లో పాల్గొన్నాడు. ఆ తరువాత చాలా వేగంగా అతని కీర్తి పెరుగుతూ వచ్చింది. నాలుగు సంవత్సరాల క్రితం మొట్ట మొదటి ప్రధాన పోటీలో పాల్గొనే సమయంలో ఒక జత బూట్లను కూడా కొనలేని పేదరికంలో ఉన్నాడు. ఆ సమయంలో బూట్లు అరువు తెచ్చుకుని పోటీకి దిగారు.
కిప్టమ్ కోచ్, హకిజిమానా, 36, రిటైర్డ్ రువాండిస్ రన్నర్. గత సంవత్సరం, కిప్టమ్ ప్రపంచ రికార్డును లక్ష్యంగా శ్రమించడం కోసం నెలల తరబడి అతనికి శిక్షణ ఇచ్చాడు. కోచ్, అథ్లెట్ లుగా వారి అనుబంధం 2018లో ప్రారంభమైంది.