Asianet News TeluguAsianet News Telugu

పసికందును ఊయలకు బదులు ఓవెన్ లో పడుకోబెట్టిన తల్లి.. తరువాత ఏమైందంటే ?

ఓ తల్లి ఊయల (swing) అనుకొని తన నెల రోజుల కూతురును ఓవెన్ (Oven)లో పడుకోబెట్టింది. ఊపిరి ఆడక, కాలిన గాయాలతో ఆ చిన్నారి (Child dies after being laid in an oven)మరణించింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

The mother made her daughter sleep in the oven instead of the cradle. Daughter dies of burn injuries..ISR
Author
First Published Feb 12, 2024, 7:02 AM IST

నెల రోజుల పసికందును తల్లి నిద్రపుచ్చేందుకు ప్రయత్నించింది. ఎంతకీ నిద్రపోకపోవడంతో ఊయలలో వేయాలని భావించింది. అయితే ఊయల అనుకొని పొరపాటున ఓవెన్ లో ఆ చిన్నారిని పడుకోబెట్టింది. దీంతో ఆ పాప కాలిన గాయాలతో మరణించింది. ఈ ఘటన అమెరికాలోని మిస్సోరీ కాన్సాస్ సిటీలో జరిగింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక ఆ పరీక్షలు కూడా తెలుగులోనే..

వివరాలు ఇలా ఉన్నాయి. కాన్సాస్ సిటీలో నివాసం ఉండే మరియా థామస్ అనే మహిళకు నెల రోజుల క్రితం కూతురు జన్మించింది. అయితే ఆ చిన్నారిని నిద్ర పుచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ క్రమంలో ఊయల అనుకొని ఓవెన్ లో పడుకోబెట్టింది. కొంత సమయం తరువాత వచ్చి చూస్తే చిన్నారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో కంగారు పడిన ఆమె వెంటనే 911కు కాల్ చేసింది.

వావ్.. నదిలో జాలర్లకు దొరికిన అరుదైన భారీ స్పటిక శివలింగం.. ఎంత విశిష్టమైనదో తెలుసా ?

అధికారులు వచ్చి చూడగా కాలిన గాయాలతో ఉన్న శిశువును గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని నిద్ర పుచ్చేందుకు ప్రయత్నిస్తూ పొరపాటున ఊయలకు బదులు ఓవెన్ లో పెట్టానని ఆమె పోలీసులకు వివరణ ఇచ్చింది. ఘటనాస్థలిపై స్పందించిన కాన్సాస్ సిటీ అగ్నిమాపక శాఖ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రకటించింది.

వామ్మో.. డెయిరీ మిల్క్ చాక్లెట్ లో బతికున్న పురుగు..వీడియో వైరల్, స్పందించిన క్యాడ్బరీ.

ఘటనా స్థలంలో కాలిన గాయాలతో ఉన్న బేబీ బ్లాంకెట్ ను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెపై మొదటి డిగ్రీలో పిల్లల సంక్షేమానికి భంగం కలిగించే క్లాస్ ఎ నేరం, డెత్ ఆఫ్ ఎ చైల్డ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు అయితే ఆమెకు కనిష్ఠంగా పదేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదు విధిస్తారు

Follow Us:
Download App:
  • android
  • ios