Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లోని తిహార్ జైలులో భర్త.. పాకిస్తాన్ మంత్రిగా భార్య.. వీరిద్దరి ఆసక్తికర స్టోరీ ఇదే

పాకిస్తాన్‌లో ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత గురువారం కొత్త క్యాబినెట్‌ను ప్రకటించారు. ఇందులో ముషార్ హుస్సేన్ ముల్లిక్ కూడా ఉన్నారు. ఆమె కశ్మీరీ వేర్పాటువాద నేత, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించారనే అభియోగాల కింద తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న యాసిన్ మాలిక్ భార్య.
 

kashmiri separatist leader yasin malik wife mushaal hussen mullick gets into pakistan cabinet kms
Author
First Published Aug 18, 2023, 2:19 PM IST

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కాకర్ గురువారం నూతన క్యాబినెట్‌ను ప్రకటించారు. సంక్లిష్ట కాలంలో పాకిస్తాన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన అడుగులు వేస్తున్నారు. జనరల్ ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కాకర్ ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది. కాకర్ ప్రకటించిన క్యాబినెట్‌లో అందరి కళ్లు ముషాల్ హుస్సేన్ ముల్లిక్ పైకే మళ్లాయి. ఆమెను ప్రధానమంత్రికి మానవ హక్కుల విషయంలో ప్రత్యేక అసిస్టెంట్‌గా నియమించారు. ఈమె నియామకంపై ఎందుకా ఆసక్తి అంటే.. ముషార్ హుస్సేన్ ముల్లిక్ కశ్మీరీ వేర్పాటువాద నేత, ఉగ్రవాదులకు నిధులు అందించారనే అభియోగాలతో భారత్‌లోని తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న యాసిన్ మాలిక్ భార్య.

కశ్మీర్ రాజకీయాలను యాసిన్ మాలిక్  కొన్నాళ్లు ప్రభావితం చేశాడు. ఆయన వేర్పాటువాద నేతగా పేరుపొందాడు. 2019లో యాసిన్ మాలిక్ అరెస్టు అయ్యాడు. ఆయనకు జీవిత ఖైదు శిక్ష మే 2022లో ఖారరైంది. భారత భద్రతా బలగాలపై జరిపిన అనేక హింసాత్మక దాడుల్లో ఆయన ప్రమేయం, కేంద్ర మాజీ హోం మంత్రి కూతురు రుబయా సయీద్‌ను అపహరించడంలో ప్రమేకయం ఉన్నదనే ఆరోపణలు యాసిన్ మాలిక్ పై ఉన్నాయి. ఉగ్రకార్యకలాపాలకు నిధులు అందించారని, భారత ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) యాసిన్ మాలిక్‌ను అరెస్టు చేసింది.

ఎవరీ ముషాల్ హుస్సేన్ ముల్లిక్?

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన ముషాల్ హుస్సేన్ ముల్లిక్ 2009లో యాసిన్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. యాసిన్ మాలిక్ పాకిస్తాన్‌కు వెళ్లిన ఓ పర్యటనలో 2005లో ముషార్ హుస్సేన్ ముల్లిక్‌ను కలిశాడు. వీరికి పదేళ్ల కూతురు ఉన్నట్టు సమాచారం.

Also Read: కోచింగ్ హబ్ ‘కోటా’లో పెరిగిన ఆత్మహత్యలు.. పరిష్కారంగా కొత్తరకం ఫ్యాన్లు.. ఉరి వేసుకుంటే ఊడివచ్చేలా..! (Video)

ముషాల్ తల్లి రెహానా హుస్సేన్ ముల్లిక్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ మహిళా విభాగానికి జనరల్ సెక్రెటరీగా చేశారు. తండ్రి ఎంఏ హుస్సేన్ ప్రసిద్ధ ఆర్థిక ప్రొఫెసర్. పాకిస్తాన్ నోబెల్ ప్రైజ్ జ్యూరీలో తొలి సభ్యుడిగా ఉన్నారు.

అధికారిక ప్రకటన ప్రకారం, పాకిస్తాన్ క్యాబినెట్‌లో 16 మంది ఫెడరల్ మంత్రులు, ముగ్గురు సలహాదారులు ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios