అమృతానందమయి కౌగిళ్లపై సింగర్ అసభ్య ట్వీట్లు

First Published 23, May 2018, 11:10 AM IST
Kanye West tweets about Mata Amritanandamayi’s hugs
Highlights

రతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయిపై వివాదాస్పద అమెరికన్ ర్యాప్ సింగ్ కాన్యే వెస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయిపై వివాదాస్పద అమెరికన్ ర్యాప్ సింగ్ కాన్యే వెస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె 32 మిలియన్ల కౌగిళ్లపై అసభ్యకరమైన ట్వీట్లు చేశారు. 

మాతా అమృతానందమయి మాకు కౌగిలింతలు కావాలి. ఇప్పటి వరకూ 32 మిలియన్ల కౌగిలింతలు ఇచ్చారు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఏడాది కాలంగా ట్వీటర్‌కు దూరంగా ఉంటున్న కాన్యే ఇటీవల తన ఖాతాను తిరిగి తెరిచి మాతా అమృతానందమయిపై ఈ విధంగా ట్వీట్‌ చేశారు. 

కేరళకు చెందిన ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి తన వద్దకు వచ్చిన భక్తులకు కౌగిలింతలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. తన వద్దకు వచ్చే భక్తులు చాలా విషాదంతో వస్తుంటారని, వారి సమస్యలతో తన వద్ద కన్నీరు పెట్టుకుంటారిని భక్తులను వారి సమస్యల నుంచి దారి మళ్లించడానికి తాను ప్రేమతో కౌగిలించుకుంటానని ఆమె తెలిపారు. 

అదే  భక్తులకు తనపై ఉన్న నమ్మకంగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మాతా అమృతానందమయికి 3.4 కోట్ల మంది భక్తులు ఉన్నారని చెప్పుకుంటారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.

loader