జస్టిన్ ట్రూడోను భారత్‌లో లాఫింగ్ స్టాక్‌గా పరగణిస్తున్నారు..: కన్జర్వేటివ్ పార్టీ నేత కీలక వ్యాఖ్యలు
కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలివ్రే కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో దౌత్యపరమైన వివాదంపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను పోయిలివ్రే నిందించారు.
కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలివ్రే కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో దౌత్యపరమైన వివాదంపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను పోయిలివ్రే నిందించారు. జస్టిన్ ట్రూడోను భారత్‌లో ఇండియాలో లాఫింగ్ స్టాక్‌గా పరగణిస్తున్నారని అన్నారు. నేపాల్ మీడియా సంస్థ నమస్తే రేడియో టొరంటోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొయిలీవ్రే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-కెనడాల మధ్య దౌత్య వివాదం గురించి ప్రశ్నించినప్పుడు.. ట్రూడో అసమర్థుడు, అన్‌ప్రొఫెషన్ అని విమర్శించారు. కెనడా ఇప్పుడు భారత్‌తో సహా ప్రపంచంలోని దాదాపు అన్ని శక్తివంతమైన దేశాలతో పెద్ద వివాదాల్లో ఉందని ఆయన అన్నారు.
కెనడాకు భారత ప్రభుత్వంతో ప్రొఫెషనల్ బంధం అవసరమని.. తాను ప్రధాని అయితే అందుకోసం కృషి చేస్తామని పొయిలీవ్రే అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌తో ఇలాంటి వివాదాలకు వెళ్లడం మంచిది కాదని అన్నారు. ఒకరికొకరు జవాబుదారీగా ఉండటం ముఖ్యమని చెప్పారు. కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘‘హిందూ మందిరాలపై జరుగుతున్న దాడులన్నింటినీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. హిందూ నాయకులపై బెదిరింపులు, బహిరంగ కార్యక్రమాల్లో భారతీయ దౌత్యవేత్తలపై చూపే దూకుడు పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. నేను దానిని వ్యతిరేకిస్తూనే ఉంటాను’’ అని పియరీ పోయిలీవ్రే అన్నారు. హిందువులపైనా, హిందూ దేవాలయాలపైనా దాడులు చేసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని అన్నారు.
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించి తమ ప్రభుత్వం గత నెలలో పార్లమెంటులో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. భారత్‌పై ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి భారతదేశం, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా దౌత్యపరమైన ఉద్రికత్తలు మరింత ముదురుతున్నాయి. భారత్‌లోని 41 మంది కెనడా దౌత్యవేత్తలకు ఉండే అంతర్జాతీయ దౌత్యపరమైన రక్షణలను ఉపసంహరిస్తామని భారత్ అల్టిమేటం జారీ చేయడంతో.. ఆ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్టు కెనడా శుక్రవారం ప్రకటించింది.
తాజాగా మరోసారి భారత్‌పై జస్టిస్ ట్రూడో విమర్శలు చేశారు. కెనడా దౌత్యవేత్తలపై అణిచివేతతో ఇరు దేశాల్లోని లక్షలాది మంది ప్రజల సాధారణ జీవనాన్ని భారత ప్రభుత్వం కష్టతరం చేస్తోందని కామెంట్స్ చేశారు.