జెన్సన్ హువాంగ్ స్టోరీని ఒక కుంభకోణంగానే చూస్తున్నారు, ఇలాంటి స్కామ్‌లన్నీ గొడవలే. కానీ టెక్నాలజీని ఎలా రక్షించుకోవాలో ప్రపంచం నిర్ణయించుకోవాలన్నదే దీని వెనకున్న అసలు సిగ్నల్.

రచయిత : రాజీవ్ చంద్రశేఖర్ (మాజీ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి (ఎలక్ట్రానిక్స్ ఆండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ ఆండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ శాఖలు), ప్రస్తుత బిజెపి కేరళ అధ్యక్షులు, నెమన్ ఎమ్మెల్యే)

గత ఆదివారం ఎన్విడియా చీఫ్ జెన్సన్ హువాంగ్ ఒక పెద్ద బాంబు పేల్చారు. తన కంపెనీ సిబ్బందికి రాసిన ఈమెయిల్‌లో సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌తో తనకు ఎఫైర్ ఉన్నట్లు ఆయన అంగీకరించారు. "నేను చేసిన దానికి ఎలాంటి చింతా లేదు" అని ఆయన రాశారు.

అయితే ఈ మెగాస్పీడ్ కంపెనీ ద్వారానే చైనాకు అక్రమంగా చిప్స్ సరఫరా అవుతున్నాయని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం… ఆలిస్ హువాంగ్‌ చైనా స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ కోసం పనిచేస్తున్నారని అమెరికా ప్రభుత్వం గుర్తించింది. ఎన్విడియా చిప్స్‌ను చైనాకు చేర్చడానికే ఆమెను నియమించినట్లు తెలుస్తోంది.

ఏఐ అనేది శాశ్వత మార్పు, కేవలం మార్కెట్ ట్రెండ్ కాదు. గత వారం మార్కెట్లు ఈ విషయాన్ని స్పష్టంగా చూపించాయి. అమెరికా ఎన్నికల ప్రభావంతో, డేటా సెంటర్లపై కఠిన నిబంధనలు వస్తాయన్న భయంతో ఏఐ స్టాక్స్ నుంచి ఒక్కరోజులో 2.5 నుంచి 3 ట్రిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రభుత్వాలు ముందే గ్రహించిన దానికి ఇన్వెస్టర్లు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు.

ఈ దశాబ్దంలో ఏఐ అతిపెద్ద భౌగోళిక రాజకీయ యుద్ధభూమిగా మారింది, పోటీ అంతా కంప్యూట్ మీదే. వాషింగ్టన్ అనుమతి పొందిన కొన్ని చైనా కంపెనీలకు H200లను హ్యాండిల్ చేయడానికి ఇచ్చిన ఆఫీసులు వాడకుండా ఖాళీగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ గుర్తించింది. షిప్‌మెంట్, మోడల్, ఇంజనీర్ లేదా ఎగ్జిక్యూటివ్.. ఇలా ఈ టెక్నాలజీకి చేరే ప్రతి దారి ఇప్పుడు టార్గెటే.

‘’జెన్సన్ కన్ఫర్మ్ చేసిన ఆ రిలేషన్‌షిప్‌ అనుకోకుండా జరిగింది కాదు..'' అమెరికా అధికారుల ఈ మాటలు నిజమైతే దశాబ్దాల నాటి వ్యూహానికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే.

ఈ వార్త బయటకు రాగానే "హనీ ట్రాప్ ద్వారా టెక్నాలజీ దొరుకుతున్నప్పుడు మళ్లీ R&Dపై పెట్టుబడి ఎందుకు?" అని నేను పోస్ట్ చేశాను. నా ఉద్దేశం వెటకారమే అయినా అందులో ఒక నిజమైన ప్రశ్న ఉంది. ఓపెన్‌నెస్‌ను అందరూ సమానంగా తీసుకుంటారని పాశ్చాత్య దేశాలు మూడు దశాబ్దాలుగా భావించాయి. చైనా కూడా తమ రూల్స్‌కు తగ్గట్టు మారుతుందని ఆశించి, వారు తమ మార్కెట్లు, యూనివర్సిటీలు, ల్యాబ్‌లు, టాలెంట్ నెట్‌వర్క్‌లను ఓపెన్ చేశారు. కానీ చైనా మాత్రం ఎంపిక చేసుకున్న వాటికే తలుపులు తీసి, వెస్ట్ ఓపెన్‌నెస్‌ను మాత్రం నిర్దాక్షిణ్యంగా వాడేసుకుంది.

2003లో సిస్కో కంపెనీ హువావేపై దావా వేసింది. హువావే రూటర్ సాఫ్ట్‌వేర్‌లో సిస్కో సోర్స్ కోడ్ ఉందని, బగ్స్ కూడా సేమ్ ఉన్నాయని ఆరోపించింది. బయటి అనధికార సోర్స్ నుంచి కొంత కోడ్ తీసుకున్నట్లు హువావే కోర్టు పత్రాల్లో అంగీకరించింది. సిస్కో కోడ్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో కాపీ చేసి హువావే ప్రొడక్ట్‌లో వాడినట్లు 2004లో కోర్టు నియమించిన ఎక్స్‌పర్ట్స్ తేల్చారు. ఆ తర్వాత ఈ కేసు రహస్య ఒప్పందంతో సెటిల్ అయింది, కోడ్ తొలగించారు, పబ్లిక్ రికార్డుల్లో మాత్రం తప్పు ఒప్పుకున్నట్లు లేదు. కానీ రికార్డులు అన్నీ చెబుతున్నాయి.

నార్టెల్ కేసు మరో ఉదాహరణ. కనీసం 2000 సంవత్సరం నుంచి హ్యాకర్లు, సీఈఓతో సహా ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌ల పాస్‌వర్డ్‌లు దొంగిలించి, నెట్‌వర్క్‌లోకి చొరబడి, డేటాను షాంఘైకి పంపినట్లు ఇన్వెస్టిగేటర్లు కనుక్కున్నారు. హువావే పైకి ఎదుగుతున్న టైమ్‌లో, 2009లో నార్టెల్ దివాళా తీసింది. దీని వెనుక చైనా ప్రభుత్వం ఉందని ఇన్వెస్టిగేటర్లు ఆరోపించారు, హువావే కాదంది. కానీ బీజింగ్, హువావే ఇద్దరూ దీన్ని ఖండించారు.

ఇలాంటివి చాలా ఆరోపణలు ఉన్నా బీజింగ్ వాటన్నింటినీ ఖండించినా.. అసలు పాయింట్ ఏంటంటే దశాబ్దాలుగా సాగుతున్న ప్యాట్రన్. ప్రత్యర్థులు, ముఖ్యంగా చైనా, పెట్టుబడిదారులు, పరిశోధకులు, రొమాంటిక్ పార్ట్‌నర్స్ ముసుగులో "సోషల్ ఎస్పియోనేజ్" చేస్తున్నారని ఒక సీనియర్ అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారి ది టైమ్స్ ఆఫ్ లండన్‌కు చెప్పారు. ఈ ఏఐ కాలంలో ఓపెన్ డోర్ అంటే ఏపీఐ కీ, లింక్డ్‌ఇన్ రిక్వెస్ట్, డిన్నర్ ఇన్విటేషన్.. ఇవే.

ఈ వ్యూహం కేవలం సాఫ్ట్‌వేర్, చిప్స్‌కే పరిమితం కాలేదు. రూల్స్ ప్రకారం దొరకని వాటిని, ఏదో ఒక దారిలో దక్కించుకుని.. చైనా, పాకిస్థాన్, నార్త్ కొరియాలు తమ ప్రమాదకరమైన సామర్థ్యాలను పెంచుకున్నాయి.

పాకిస్థాన్ బాంబు తయారీ ఒక దొంగతనంతో మొదలైంది. 1975లో AQ ఖాన్ నెదర్లాండ్స్ నుంచి బయలుదేరారు. ఎన్రిచ్‌మెంట్ కన్సార్టియం URENCO కాంట్రాక్టర్ దగ్గర పనిచేసిన ఆయన సెంట్రిఫ్యూజ్ డిజైన్లను దొంగిలించుకుని వెళ్లారు. ఆర్మ్స్-కంట్రోల్ ఎనాలిసిస్ ప్రకారం, పాకిస్థాన్‌కు న్యూక్లియర్ వెపన్ డిజైన్, ట్రైనింగ్ చైనానే ఇచ్చింది. ఆ తర్వాత ఖాన్ ఫ్రంట్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా ఇరాన్, లిబియా, నార్త్ కొరియాకు సెంట్రిఫ్యూజ్‌లు, నైపుణ్యాన్ని అమ్మేశారు.

వాషింగ్టన్ ఫైల్స్‌లో చైనా రికార్డు కూడా ఉంది. 1999 కాక్స్ కమిటీ రిపోర్ట్ ప్రకారం, అమెరికా W88 వార్‌హెడ్‌కు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని చైనా గూఢచర్యం ద్వారా దొంగిలించిందని తేల్చారు. దీన్ని బీజింగ్ తిరస్కరించింది. ఈ మూడు దేశాల్లో రెండు మన పొరుగున ఉండటంతో.. ఇండియాకు ఇవన్నీ కేవలం చదువుకునే విషయాలు కాదు, నిజమైన ముప్పులు.

2018లో నేను ఒక మాట చెప్పాను. టెక్నాలజీ భవిష్యత్తును నమ్మకమైన భాగస్వాములు మాత్రమే నిర్ణయించాలి, కంట్రోల్ చేయాలి. విలువలు, చట్టాలు గౌరవించే దేశాలు, మేథోసంపత్తిని కాపాడే దేశాలు, దొంగతనాలకు బదులు ఇన్నోవేషన్‌ను నమ్మే దేశాలు ఆ వ్యవస్థను ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నాయి. కాస్త లేట్ అయినా.. డిసెంబర్ 2025లో ప్రారంభమైన పాక్స్ సిలికా చిప్స్, ఏఐ, క్రిటికల్-మినరల్స్ సప్లై చైన్‌ను కాపాడటానికి నమ్మకమైన దేశాలను ఏకం చేస్తోంది. జపాన్, సౌత్ కొరియా, యూకే, సింగపూర్‌లతో పాటు ఇండియా కూడా ఫిబ్రవరిలో ఈ డిక్లరేషన్‌పై సంతకం చేసింది.

కానీ ఇది సరిపోతుందా? ఎందుకంటే జెన్సన్ హువాంగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ ఉన్న సింగపూర్ కూడా ఇందులో మెంబరే కదా! నమ్మకం అంటే ప్రకటించుకోవడం కాదు, ప్రూవ్ చేసుకోవాలి. ఈ ట్రస్ట్ కోయలిషన్‌కు ఉమ్మడి కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. ఎగ్జిక్యూటివ్‌లు, రీసెర్చర్లు, అధికారులకు అప్రోచ్ టాక్టిక్స్‌పై బ్రీఫింగ్ ఇవ్వాలి, ప్రొక్యూర్‌మెంట్ ఫ్రంట్స్‌ను ఫ్లాగ్ చేయాలి, ఫైండింగ్స్‌ను పంచుకోవాలి. ప్రతి సభ్య దేశపు రెగ్యులేటర్లకు.. డేటా సెంటర్ ఆపరేటర్లు, రీసెల్లర్లు, చిప్ బయర్స్ యాజమాన్య వివరాలు పారదర్శకంగా కనిపించాలి.

పరస్పర సహకారం అనేది కూడా చాలా ముఖ్యం. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్లకే ఓపెన్‌నెస్, లేని వాళ్లపై నిఘా ఉండాలి. చివరగా కేవలం ఫైన్లు వేసి బిజినెస్ కాస్ట్‌లో కలిపేయడం కాదు.. భయపడేలా కఠినమైన శిక్షలు ఉండాలి.

ఇవన్నీ తలుపులు మూసేయాలని చెప్పట్లేదు. ఓపెన్ సొసైటీలు స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం అవి ఓపెన్‌గా ఉండటమే. బెస్ట్ టాలెంట్, ఐడియాలను ఆకర్షించి ఇన్నోవేషన్‌లో గెలుస్తాయి. చైనా టెక్నాలజీ అంతా దొంగిలించిందే అని నేను అనట్లేదు. కానీ ఇతరుల నమ్మకాన్ని వాడుకుని నిర్మించిన వారి టెక్ క్రెడిబిలిటీ కూడా ఒక నేరమే. దీనికి పరిష్కారం ఏంటంటే.. మనం నమ్మగలిగే, ప్రూవ్ చేసుకోగలిగే భాగస్వాములకు మాత్రమే తలుపులు తెరవడం.

జెన్సన్ హువాంగ్ స్టోరీని ఒక కుంభకోణంగానే చూస్తారు, ఇలాంటి స్కామ్‌లన్నీ గొడవలే. దీని వెనుక ఉన్న అసలు సిగ్నల్ ఏంటంటే.. మనం నిర్మిస్తున్న దాన్ని కాపాడుకోవాలా వద్దా అని ప్రపంచం ఇప్పుడు తేల్చుకోవాలి.

టెక్నాలజీని దొంగిలించొచ్చు. కానీ అలా జరగకూడదు. దాని క్రెడిబిలిటీని సంపాదించుకోవాలి, నమ్మకమైన భాగస్వాములు మాత్రమే కలిసి దాన్ని సాధించగలరు.