గూగుల్ కు రాజీనామా చేసిన ఏఐ గాడ్‌ఫాదర్ జెఫ్రీ హింటన్.. ఎందుకంటే ?
ఏఐ గాఢ్ ఫాదర్ గా పేరు పొందిన జెఫ్రీ హింటన్ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కు రాజీనామా చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వల్ల కలిగే ముప్పును ఇప్పుడు తాను ప్రపంచానికి స్వేచ్ఛగా తెలుపగలనని అన్నారు.
గూగుల్ 75 ఏళ్ల జెఫ్రీ హింటన్ రాజీనామా చేశారు. ఆయన గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు పొదారు. హింటన్ తన గ్రాడ్యుయేషన్ స్టూడెంట్లతో కలిసి 2012 సంవత్సరంలో టొరంటో యూనివర్సిటీలో మొదటి సారిగా ఈ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించారు. అది ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కీలకంగా మారింది.
దారుణం.. ఐదుగురు చిన్నారులను బెదిరించి గ్యాంగ్ రేప్.. దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి..
ఈ రాజీనామా సందర్భంగా జెఫ్రీ హింటన్ మాట్లాడుతూ.. దశాబ్దానికి పైగా తాను గూగుల్ లో పని చేశానని, అయినా ఉద్యోగాన్ని వదిలేశానని చెప్పారు. ఏఐ రంగంలో అత్యంత గౌరవనీయమైన గొంతుకగా మారానని చెప్పారు. అయితే ఈ కృత్రిమ మేధ ప్రమాదాల గురించి ఇప్పుడు స్వేచ్చగా మాట్లాడగలుగుతానని చెప్పారు.
ఈ ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు దీనిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అలాంటి వ్యక్తులు నిరోధించడం కూడా కష్టమే అని తెలిపారు. తనలో ఓ భాగం.. తను జీవితంలో చేసిన పనికి పశ్చాత్తాపం చెందుతోందని చెప్పారు.
వార్నీ.. జీతం ఇవ్వలేదని మంత్రినే కాల్చేసిన బాడీగార్డ్.. ఎక్కడంటే ?
అయినా తనను తాను ఓదార్చుకుంటానని తెలిపారు. ఏఐను తాను రూపొందించకపోతే మరొకరు రూపొందించేవారని హింటన్ గత వారం టొరంటోలోని తన ఇంట్లో ఇచ్చిన ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూలో చెప్పారు. చాట్ జీపీటీ వంటి పాపులర్ చాట్ బోట్ లకు శక్తినిచ్చే సాంకేతిక పరిజ్ఞానమైన జనరేటివ్ ఏఐ ఆధారిత ఉత్పత్తులను రూపొందించేందుకు కంపెనీలు దూకుడుగా పని చేస్తూ.. ప్రమాదం దిశగా దూసుకెళ్తున్నాయని ఆయన సోమవారం అధికారికంగా పేర్కొన్నారు.