Asianet News TeluguAsianet News Telugu

రాచరికాన్ని వదిలి.. సామాన్యుడిని పెళ్లాడిన యువరాణి.. ఎట్టకేలకు ప్రేమించిన వాడితో..

జ‌పాన్ యువ‌రాణి మాకో (Japan Princess Mako) తన చిరకాల ప్రియుడు కీయ్ కౌమురోను (Kei Komuro) పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి నేడు వివాహ బంధంలోకి  అడుగుపెట్టారు. 

Japan Princess Mako Finally Marries Boyfriend Gives Up Royal Status
Author
Tokyo, First Published Oct 26, 2021, 3:28 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జ‌పాన్ యువ‌రాణి మాకో (Japan Princess Mako) తన చిరకాల ప్రియుడు కీయ్ కౌమురోను (Kei Komuro) పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి నేడు వివాహ బంధంలోకి  అడుగుపెట్టారు. ఇందుకోసం మాకో.. తన రాచరికపు హోదాను కూడా వదిలిపెట్టారు. రాచ కుటుంబం నుంచి వచ్చే కోట్లాది రూపాయల రాజ భరణాన్ని కూడా మాకో తిరస్కరించారు. తన భర్తతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్టుగా మాకో తెలిపారు. ‘మా వివాహంపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని నాకు తెలుసు. మేము ఎవరికి ఇబ్బంది కలిగించామో వారి పట్ల నేను చాలా చింతిస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితం కీయ్ స్థానం భర్తీ చేయలేనిది. వివాహం అనేది మాకు సరైన ఎంపిక’అని మాకో తెలిపారు. 

‘నేను మాకోను ప్రేమిస్తున్నాను. ఎవరైనా ఒకే జీవితాన్ని పొందుతారు. ప్రేమించే వారితో గడపాలని నేను కోరుకుంటున్నాను’అని కౌమురో తెలిపారు. తప్పుడు ఆరోపణల కారణంగా మాకో మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నందుకు తనకు చాలా బాధగా ఉందని అన్నారు.

Also read: ఆర్యన్ ఖాన్ కేసులో మరో మలుపు.. ఢిల్లీకి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే.. అలాంటిది ఏం లేదని వెల్లడి..

మాకో, కొమురో వివాహాన్ని  జపాన్‌ రాజకుటుంబ వ్యవహారాలు చూసే ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ (Imperial Household Agency) ధ్రువీకరించింది. ఈ వివాహానికి సంబంధించి  ఎలాంటి విందులు, వేడుకలు ఉండ‌వ‌ని వెల్ల‌డించింది. సంప్రదాయం ప్రకారం ఆమెకు రాజ కుటుంబం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులను, చెల్లెలిని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. 

Also read: భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలి.. కానీ ఇది సమయం కాదు.. టీ20లో భారత్‌పై పాక్ విజయం తర్వాత ఇమ్రాన్ ఖాన్

జ‌పాన్ చక్రవర్తి న‌రుహిటో సోద‌రుడు ప్రిన్స్ అఖిషినో కూతురే మాకో. టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటిలో చదువుకున్నారు. తనతో పాటు చదువుకున్న కౌమురోను ఆమె ఇష్టపడ్డారు. 2017 మాకో, కౌమురో తాము పెళ్లిచేసుకున్నట్టుగా ప్రకటించారు. అదే ఏడాది.. ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కౌమురో త‌ల్లికి,  ఆమె మాజీ ప్రియుడి మ‌ధ్య ఉన్న ఆర్థిక వివాదం కారణంగా  2018లో జరగాల్సిన వీరి పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. 2018లో కౌమురో లా చదవేందుకు న్యూయార్క్ వెళ్లారు. కౌమురో తిరిగి జపాన్ చేరుకున్నాక ఈ జంట పెళ్లి ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వీరి పెళ్లి విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చివరకు అన్ని అడ్డంకులను ఎదుర్కొని వీరు నేడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

జపాన్ రాజ కుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే Royal Titleను వదుకోవాల్సి వస్తుంది. అయితే రాయల్టీ కింద వారికి కొంత  సొమ్మును ముట్టజెబుతారు. కానీ మాకో.. తనకు వచ్చే దాదాపు 10 కోట్ల రూపాయలను కూడా తిరస్కరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios