జైషే మహ్మద్ ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారిఖ్ హతం.. కరాచీలో కాల్చిచంపిన గుర్తు తెలియని వ్యక్తులు..
Maulana Raheem Ullah Tariq : జైషే మహ్మద్ ఉగ్రవాది మౌలానా రహీం ఉల్లా తారిఖ్ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. అతడు ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్తుండగా కరాచీలోని ఓరంగి పట్టణ ప్రాంతంలో అతడిపై కాల్పులు జరగడంతో, తీవ్రగాయాలతో చనిపోయాడు.
Maulana Raheem Ullah Tariq : జైషే మహ్మద్ ఉగ్రవాది, వాంటెడ్ మౌలానా మసూద్ అజహర్ సన్నిహితుడు మౌలానా రహీం ఉల్లా తారిఖ్ ను కరాచీలో హత్యకు గురయ్యారు. అతడు మతపరమైన సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఓరంగి పట్టణ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని కాల్చి చంపిన వారం రోజులకే తారిఖ్ కూడా అదే విధంగా హత్యకు గురికావడం గమనార్హం.
gang-rape : దారుణం.. యువతికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం..
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా బజౌర్ జిల్లాలో బైక్ పై వచ్చిన దుండగులు ఘాజీని కాల్చి చంపారు. ఘాజీ లష్కరే తోయిబాకు రిక్రూటర్ అని, ఇటీవలి కాలంలో వివిధ బ్యాచ్ లుగా కాశ్మీర్ లోయలోకి చొరబడిన ఉగ్రవాదులు తీవ్రవాదంవైపు మరలడానికి బాధ్యుడని సమాచారం. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదులను అనుమానాస్పదంగా హతమారుస్తున్న నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది.
జమ్ముకాశ్మీర్ లోని సుంజువాన్ లో 2018లో భారత ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడితో సంబంధం ఉన్న కీలక లష్కరే తోయిబా కమాండర్ ఖ్వాజా షాహిద్ అలియాస్ మియా ముజాహిద్ ను కిడ్నాప్ చేసి శిరచ్ఛేదం చేయడం వంటి మునుపటి సంఘటనల వరకు ఈ అంతుచిక్కని హత్యల పరంపర విస్తరించింది. అదేవిధంగా ధంగ్రీ ఉగ్రదాడి సూత్రధారి రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసింను పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఓ మసీదులో కాల్చి చంపారు. రావల్పిండిలో ఇంతియాజ్ ఆలంగా పిలిచే హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యల చుట్టూ ఉన్న పరిస్థితులు అస్పష్టంగా ఉన్నాయి. ఏ సంస్థ కూడా ఈ చర్యలకు బాధ్యత వహించలేదు.
యూకే ప్రధాని రిషి సునక్ దంపతులతో జైశంకర్ భేటీ.. విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ బహుమతిగా అందజేత
తమ సరిహద్దుల్లో అపహరణలు, హత్యలకు భారత నిఘా సంస్థలు చురుగ్గా పాల్గొంటున్నాయని పాకిస్థాన్ బాహాటంగానే పేర్కొంది. దేశంలో జరుగుతున్న హత్యల వెనుక భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) హస్తం ఉందని పకుమ్తాజ్ జహ్రా బలోచ్ ఆరోపించారు. 2021 జూన్ లో జరిగిన లాహోర్ దాడిలో భారత్ ప్రమేయానికి సంబంధించి ఖచ్చితమైన, తిరుగులేని ఆధారాలతో కూడిన సమగ్ర పత్రాన్ని 2022 డిసెంబర్ లో పాకిస్తాన్ విడుదల చేసిందని ఆమె తెలిపారు.