Asianet News TeluguAsianet News Telugu

జాక్ పాట్ అంటే ఇది.. లాటరీలో ఏకంగా 13 వేల కోట్లు వరించింది…

లాటరీలో ఒకటి కాదు రెండు కాదు.. వంద కాదు, వెయ్యి కాదు... ఏకంగా 13వేల కోట్లు జాక్ పాట్ తగిలింది ఓ వ్యక్తికి. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. 

Jackpot of Rs.13 thousand crores in the lottery in usa - bsb
Author
First Published Aug 10, 2023, 4:06 PM IST

అమెరికా :  లాటరీ కొనగానే కాదు.. దానికి  జాక్పాట్ వరించినప్పుడే అదృష్టవంతులు.  అలాంటి అదృష్టం లాటరీ కొన్న ప్రతి ఒక్కరికి దక్కదు.  అయితే అమెరికాలోని ఫ్లోరిడా మెగా మిలియన్స్ లాటరీలో..  ఓ అదృష్టవంతుడికి  ఏకంగా 13 వేల కోట్లు తగిలాయి.  అతనికి 1.58  బిలియన్ డాలర్ల జాక్పాట్ తగిలింది. 

అయితే విజేత వివరాలను తెలుపలేదు. నెఫ్యూన్ బీచ్ లోని పబ్లిక్ స్టోర్ విక్రేత ఈ టికెట్ ను అమ్మారు. మంగళవారం రాత్రి ఈ లాటరీ కి డ్రా తీశారు.  అందులో  13, 19, 20, 32, 33, 14 నెంబర్ టికెట్ కు జాబ్ పాట్ దక్కినట్లు ప్రకటించారు. అమెరికా చరిత్రలో మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీ ఇదే.  ఈ మేరకు అక్కడి మీడియా సమాచారం వెల్లడించింది.

వైరల్ : పెళ్లి రిసెప్షన్ కు అతిధిగా ఎలుగుబంటి.. స్వీట్లు, డెజర్ట్స్ ఖాళీ చేస్తూ...

అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.  లాటరీలో  లో జాక్ పాట్  తగిలిన వ్యక్తికి  ఒకేసారి మొత్తం అమౌంట్ ఇవ్వరు.  ఈ 1.58  బిలియన్ డాలర్ల నగదు.. అంటే  మన కరెన్సీలో  సుమారు రూ.  13 వేల కోట్లను  ఒకేసారి ఇవ్వరు.  విడతల వారీగా… అంటే ఏడాదికి కొంత మొత్తం చొప్పున  30 ఏళ్ల పాటు ఇస్తారు.  అలా కాకుండా మొత్తం నగదు ఒకేసారి కావాలంటే.. అందులో సగం మాత్రమే.. అంటే 783.3 మిలియన్ డాలర్లు… మన లెక్కలో రూ. 6488 కోట్లు  మాత్రమే చెల్లిస్తారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios