ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కింద బస్సు.. 21 మంది మృతి
ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనిస్ సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడింది.
ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనిస్ సమీపంలో మంగళవారం సాయంత్రం పర్యాటకులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపు తప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోయారు. అదే సమయంలో 40 మంది గాయపడినట్లు అంచనా. ప్రమాద సమయంలో ఆ బస్సులో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై వెనిస్ మేయర్ లుయిగి బ్రుగ్నారో మాట్లాడుతూ..విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని ఘోరమైన విషాదంగా అభివర్ణించారు. అతను తన X హ్యాండిల్‌లో ఈ సంఘటనపై స్పందిస్తూ.. "ఇది అలౌకిక దృశ్యం. నాకు మాటలు లేవు." అని పేర్కొన్నారు.
రోడ్డుపై పడి బస్సు.. చెలరేగినా మంటలు..
వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. మేస్ట్రే జిల్లాలో ఒక బస్సు రోడ్డుపై నుంచి రైలు మార్గాలకు సమీపంలో పడిపోయింది. రోడ్డుపై పడిపోవడంతో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఖచ్చితమైన సమాచారం తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఇటలీ ప్రధాని విచారం
ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. "మేస్త్రీలో జరిగిన ఘోర ప్రమాదానికి నా తరపున, మొత్తం ప్రభుత్వం తరపున నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.నా ఆలోచనలు బాధితులు, వారి కుటుంబాలు మరియు స్నేహితులతో ఉన్నాయి. ఈ విషాదం గురించి అప్డేట్ కోసం తాను మేయర్ లుయిగి బ్రుగ్నారో,మంత్రి (ఇంటీరియర్) మాటియో పియాంటెడోసితో సన్నిహితంగా ఉన్నాను."" అని పేర్కొన్నారు.