మెలోని+మోదీ = మెలోడి : భారత ప్రధానితో ఇటలీ మహిళా ప్రధాని వీడియో వైరల్

మెలోడీ... ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  ఇటలీ  ప్రధాని మెలోనీ భారత ప్రధానితో నరేంద్ర మోదీతో దిగిన సెల్ఫీ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

Italian PM Melon and India PM Modi cheerful selfie video Viral in Social Media AKP

మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మొదటి విదేశీ పర్యటన చేపట్టారు. G7 సమ్మిట్ లో పాల్గొనేందుకు ప్రధాని ఇటలీ వెళ్లారు. ఈ సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ నరేంద్ర మోదీతో కలిసి దిగిన సెల్పీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు స్వయంగా ఇటలీ ప్రధాని ఎక్స్ వేదికన మోదీని కలిసిన వీడియోను పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

 'మెలోడి టీమ్ తరపున హలో' అంటూ ఇటలీ ప్రధాని మెలోని కామెంట్ చేసారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో కలిసి మెలోని సరదాగా చేతులూపుతూ హాయ్ చెప్పారు.  మెలోని, మోదీ పేర్లను కలిపి 'మెలోడీ' అంటూ ఇటలీ ప్రధాని చేసిన కామెంట్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో సోషల్ మీడియాలో మెలోడి అన్న పేరు, ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీ వైరల్ గా మారాయి. 

 

ఇలా భారత్, ఇటలీ ప్రధానుల మెలోడీ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. 2024 లో ఇదే అత్యుత్తమ పోస్ట్, సెల్పీ అంటున్నారు... ఇవి గుండెలకు హత్తుకునేలా వున్నాయంటున్నారు. ఇలా నెటిజన్లు మెలోడీ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియా రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తుందని మోదీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక భారత హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోదీకి G7 దేశాధినేతలు అభినందనలు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం, మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుతర్వాత మోదీ మొదటిసారి విదేశీ  పర్యటన చేపట్టారు. ఇటలీలో నిర్వహిస్తున్న G7 సమ్మిట్ లో భారత్  తో పాటు అమెరికా, యూకే, జపాన్, కెనడా, జర్మనీ, ప్రాన్స్ దేశాధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. వీరంతా మోదీకి అభినందనలు తెలపడమే కాదు కొందరు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇలా ఇటలీ ప్రధాని మెలోనియా మోదీతో సెల్పీ వీడియో తీసుకుని ఆసక్తికరంగా 'మెలోడీ' అన్న క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది. 

  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios