Isreal Soldier: హమాస్ దాడిలో 12 బుల్లెట్లు దిగబడి.. చావును ఎదురుచూస్తూ.. మృత్యువును జయించిన యువతి విజయగాధ

అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సరిహద్దులోకి చొచ్చుకెళ్లి నరమేధం సృష్టించారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి, బాంబులు పేల్చి వందలాది మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో బతికి బయటపడిన వారు october7.org అనే సైట్‌లో అనుభవాలను పంచుకున్నారు. ఇది ఫస్ట్ లెఫ్టినెంట్ ఎడెన్ రామ్ అనుభవం.
 

Isreal soldier eden ram survived who shot at 12 times, playing dead for four hours, her survival story viral kms

Hamas Attack: అది అక్టోబర్ 7వ తేదీ ఉదయం 6.30 గంటలు. ఇజ్రాయెల్ సరిహద్దులో యూరిమ్ సదరన్ జిల్లా బేస్‌లో ఎప్పటిలాగే కొందరు సైనికులు పహారా కాస్తున్నారు. అందులో లెప్టినెంట్ ఎడెమన్ రామ్ 13 మంది సైనికులతో ఉన్నారు. ప్రతి రోజులాంటి ఉదయమే అనుకుని అలక్ష్యంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది. 6.30 గంటలకు సైరన్ల బొబ్బ. మిస్సైళ్ల శబ్దాలు. శత్రువులు కనిపించడం లేదు కానీ, విధ్వంసం తాలూకు ధ్వనులు వినిపించాయి. పైజామా ధరించి, స్లిప్పర్స్ వేసుకున్న తను కూడా అందరిలాగే రాతితోకట్టిన డార్మిటరీల్లోకి వెళ్లింది.

హమాస్ ఉగ్రవాదులు సరిహద్దు దాటినట్టు గుసగుసలు వినిపించాయి. కానీ, వాటిని నమ్మే స్థితిలో ఆమె లేదు. అప్పుడు బాంబు పేలుళ్లు, తుపాకీ శబ్దాలు బిగ్గరగా వినిపించాయి. దీంతో అందరూ దుర్బేధ్యమైన ఆపరేషన్స్ రూమ్‌కు పరుగులు పెట్టారు. నేను కూడా అటు వైపుగా పరిగెత్తాను. వెనుక నుంచి బుల్లట్లు విసురుగా వస్తున్నాయి. ఒకటి నా కాలికి దిగింది. అయినా.. పట్టించుకోవట్లేదు. పిచ్చిగా పరిగెత్తాను. 

నా ముందు పరిగెత్తిన వారంతా ఆపరేషన్స్ రూమ్‌లోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. ఎంత బాదినా తెరవలేదు. నా వెనుక వస్తున్న ఉగ్రవాదులతో భీతిల్లి తలుపులు తీయలేదు. దీంతో టెర్రస్ వెనుక వైపునకు వెళ్లగా.. అప్పుడు లోనికి తీసుకున్నారు. ఒకరు యూనిఫామ్ తీసి నా కాలికి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులంతా ఆపరేషన్స్ రూమ్ చుట్టుముట్టారు. ఎంత తెరిచే ప్రయత్నం చేసినా ఓపెన్ కావడం లేదు. దీంతో తలుపులను షూట్ చేస్తున్నారు. పేల్చుతున్నారు.

Also Read: Rajasthan CM: రాజస్తాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ.. బీజేపీ సంచలన నిర్ణయం

అలా.. ఒక్కో ద్వారా తెరుచుకుంటూ లోనికి వస్తున్నారు. లోపల ఉన్న మేం దేవుడిపై భారం వేసి భయంతో వణికిపోతున్నాం. ఇంతలో మమ్మల్ని రక్షించే దళాలు వస్తాయని అనుకున్నాం. కానీ, వారికంటే ముందు ఉగ్రవాదులు మా చివరి డోర్ వరకూ వచ్చేశారు. అందరికీ ముచ్చెమటలు పట్టాయి. మేం టేబుళ్ల వెనుక నక్కాం. ఒకరిపై ఒకరు ఆ టేబుళ్లకు వెనుకాలే పడుకుని కుక్కినట్టుగా ఉన్నాం. చివరికి ఆ ఉగ్రవాదులు లాస్ట్ డోర్‌ కూడా ఓపెన్ చేశారు. నా ఆప్తులకు నేను గుడ్ బై మెస్సేజీలు పంపుతున్నాను. అంతే..  బుల్లెట్ల వర్షం కురిసింది. ఒక లక్ష్యం అంటూ లేకుండా గది అంతా కాల్పులు జరిపారు. అరుపులు కేకలతో దాక్కున్నవారం ఒకరి వెంట ఒకరం నేలకొరిగిపోతున్నాం.

కొంతసేపటికి తెరిపి ఇచ్చి అరబిక్‌లో ఏదో మాట్లాడుకున్నారు. డాక్యుమెంట్ల కోసం వెతికారు. ఆ తర్వాత మేం అంతా చనిపోయామా లేదా? అని చెక్ చేశారు. అప్పటికే నా బాడీలోకి 12 బుల్లెట్లు చొరబడ్డాయి. నేను ప్రాణాలతో ఉన్నానా? చనిపోయానా? అనే సోయి కూడా లేకుండా పోయింది. కానీ, నేను వినగలుగుతున్నా.. చూడగలుగుతున్నా. చావడానికి చివరి బుల్లెట్ కోసం ఎదురుచూస్తున్నాను. కానీ, అది ఎప్పటికీ రాలేదు. చెక్ చేసిన తర్వాత ఆ ఉగ్రవాదులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Also Read: Free Bus: మహిళలకు టికెట్ ఇచ్చిన కండక్టర్ పై దర్యాప్తు పూర్తి.. టికెట్లు ఎందుకు ఇచ్చాడంటే?

నా మిత్రుల డెడ్ బాడీల నడుమ నేనూ రక్తాన్ని కారుస్తూ పడిపోయి ఉన్నాను. నా బాడీ చుట్టూతా రక్తమే ఉన్నదని తెలుస్తున్నది. ఇంతలోనే నా పక్క నుంచి ఒకరి శ్వాస నా బాడీకి తగిలింది. అది నా ఫ్రెండ్ సహర్‌ది. ఆమె లేచి యూనిఫామ్ నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి నాకు ప్రథమ చికిత్స చేస్తున్నది. నేను నా బాడీ మొత్తాన్ని తడుముకుంటూ.. నాకు ఎక్కడెక్కడ బుల్లెట్లు పడ్డాయా? అని చూసుకుంటున్నాను. బ్లడ్ ఎంత బ్లీడ్ అవుతున్నదీ? ఇంకా ఎంత సమయం నేను ప్రాణాలతో ఉండాల్సింది? అంచనా వేసుకుంటున్నాను. అప్పుడు నేను చనిపోతున్నాను అనే అనిపించింది. సహాయం కోసం సుమారు నాలుగు గంటలు మేం అక్కడ పడిగాపులు కాస్తూనే ఉన్నాం.

Also Read: RSP: బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రివర్స్ గేర్?

తీవ్రమైన నొప్పిలో ఉన్నా.. కంఠం నుంచి ఒక్క శబ్దమూ బయటకు రాలేదు. నాలుగు గంటలు చావును నటించిన తర్వాత ఏంజెల్స్ వచ్చి మమ్మల్ని కాపాడారు. హాస్పిటల్ తీసుకెళ్లుతుండగా.. నా ఫ్యామిలీకి ఫోన్ చేసి.. నేను సజీవంగానే ఉన్నట్టు చెప్పమని కోరాను. 

తొలి 48 గంటలు ఆపరేషన్ థియేటర్ కూడా యుద్ధాన్నే తలపించింది. రెండు లైఫ్ సేవింగ్ ఆపరేషన్లు జరిగాయి. ఎక్కువ డోసు మత్తు ఇచ్చి తర్వాతి మూడు రోజులు ఆమెను వెంటిలేషన్ మీదే ఉంచారు. ఆమె వేగంగా కోలుకున్నారు. ఇప్పుడు ఆ ఫస్ట్ లెఫ్టినెంట్ ఎడెన్ రామ్ మెల్లిగా నడవగలుగుతున్నారు. ఆమె ధైర్యానికి గాను ఇజ్రాయెల్ అధ్యక్షుడి నుంచి ఆమె ఐజాక్ హెర్జోగ్ అవార్డును పొందారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios