RSP: బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రివర్స్ గేర్?

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే ఫోకస్ పెట్టారు. అయితే.. తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని తీసుకువచ్చారు. ఈ పథకంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.
 

bsp telangana chief rs praveen kumar raises concerns over free bus travel to women kms

హైదరాబాద్: బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేసి మూడో స్థానానికే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉన్నది. ఈ సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పట్ల తన స్టాండ్‌ను మార్చుకున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇందుకు ఆయన చేసిన రెండు ట్వీట్లు. 

డిసెంబర్ 7వ తేదీన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. ఎనుములు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదే ట్వీట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నిలబెట్టుకోవాలని కోరుతున్నా అని కూడా పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల క్యాంపెయిన్‌లో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులో మహాలక్ష్మీ స్కీం ఉన్నది. దీని ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడం. డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అమల్లోకి తెచ్చారు. ఈ పథకం అమలు మొదలై రెండు రోజులు కూడా కాకముందే ఆర్ఎస్పీ మరో కామెంట్ ఎక్స్ వేదికగానే చేశారు. ఈ పథకాన్ని ఆయన విమర్శించారు.

Also Read: BC Bandhu: బీసీ బంధుకు తాత్కాలిక బ్రేక్.. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఇప్పడిప్పుడే ఆర్టీసీ నష్టాల్లో నుంచి బయటకు వస్తున్నదని, ఈ సందర్భంలో మహిళలకు ఉచిత ప్రయాణ హామీ సంస్థపై పెనుభారాన్ని మోపుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఆర్టీసీలో పని చేస్తున్న సుమారు 50 వేల మంది కార్మికుల జీవితాల మీద ప్రభావం చూపుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా చాలా గ్రామాలకు బస్సు సర్వీసులను పలు కారణాలతో బంద్ చేశారని, ఇప్పుడు మళ్లీ వాటిని పంపించే సాహసం ఆర్టీసీ చేయగలదా? అనే ప్రశ్నతో ఆయన కీలకమైన సందేహాన్ని బయటపెట్టారు. అలాగే, ఆటో డ్రైవర్లు ప్రయాణికుల సంఖ్య తగ్గి జీవితమే భారంగా మారుతుందనే భయాల్లో ఉన్నారని వివరించారు. ఆటో డ్రైవర్ సోదరులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

దీంతో నెటిజన్లు ఆర్ఎస్పీపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. 7వ తేదీన కాంగ్రెస్ ప్రకటించిన అన్ని హామీలను నిలబెట్టుకోవాలని కోరి.. 10వ తేదీన  అమలు చేస్తున్న స్కీంపై విమర్శలు చేయడం ఏమిటీ? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు అసలు ఆర్టీసీనే ప్రభుత్వంలో విలీనం చేశారు కదా? అని చెబుతున్నారు. ఆ ఉచిత ప్రయాణాలను ప్రభుత్వమే భరించుకుని ఆర్టీసీకి సబ్సిడీ ఇస్తుంది కదా అని, ఆ జీరో టికెట్లు అందుకే కదా.. అని కూడా మరికొందరు వివరిస్తున్నారు. అమల్లోకి వచ్చి రెండు రోజులు కూడా కాకుమందే ఇలా రాయి వేయడం సరికాదని మరికొందరు కామెంట్ చేశారు. నిజానికి మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని చాలా మంది హర్షిస్తున్నారు. ప్రతిపక్షంలోని వారు కూడా  ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ తరుణం లోనే ప్రవీణ్ కుమార్ సార్ వ్యాఖ్యలు రివర్స్ గేర్ వేసినట్టుగా ఉన్నాయని కామెంట్లు వస్తున్నాయి.

Also Read: Free Bus: మహిళలకు టికెట్ ఇచ్చిన కండక్టర్ పై దర్యాప్తు పూర్తి.. టికెట్లు ఎందుకు ఇచ్చాడంటే?

బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మార్పుకు చిహ్నంగా ఉంటారని భావించారు. ముఖ్యంగా బహుజనులు ఆయనపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్నారు. సిర్పూర్‌లో ఆర్ఎస్పీ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, పరాజయం పాలయ్యారు. రైట్ వింగ్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆయన పోటీ చేసిన స్థానంలో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ బాబు విజయకేతనం ఎగరేశారు. రెండో స్థానానికి పరిమితమైన సిట్టింగ్, బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప కంటే సుమారు 3 వేల ఓట్ల మెజార్టీతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. మూడో స్థానానికి పరిమితమైన ఆర్ఎస్పీ 44 వేల ఓట్లు సంపాదించుకున్నారు. ఆర్ఎస్పీ ఓటమి బీఎస్పీ శ్రేణులకు నిరాశ కలిగించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios