Asianet News TeluguAsianet News Telugu

ఇరాక్ ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి.. హత్యాయత్నంగా పేర్కొన్న మిలటరీ..

ఇరాక్ (Iraq) ప్రధాని ముస్తఫా అల్ కదిమి ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది. ముస్తఫా అల్ కదమి (Mustafa al-Kadhimi) నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ దాడి (drone attack) జరిగిందని ఇరాక్ మిలటరీ తెలిపింది. 

Iraq PM Mustafa al-Kadhimi safe after drone attack on residence
Author
Baghdad, First Published Nov 7, 2021, 9:29 AM IST

ఇరాక్ (Iraq) ప్రధాని ముస్తఫా అల్ కదిమి ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది. ముస్తఫా అల్ కదమి (Mustafa al-Kadhimi) నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ దాడి (drone attack) జరిగిందని ఇరాక్ మిలటరీ తెలిపింది. దీన్ని హత్యాయత్నంగా పేర్కొంది. ఈ ఘటనలో ప్రధాని ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారని వెల్లడించింది. అయితే ఈ దాడిలో ప్రధాని వ్యక్తిగత రక్షణ సిబ్బంది‌ పలువురు గాయపడ్డారు. గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే ప్రధాని నివాసం డ్రోన్ దాడి జరడగం తీవ్ర కలకలం రేపింది. 

Also read: ఆయిల్ ట్యాంకర్ పేలి 92 మంది దుర్మరణం.. మరో 30 మంది పరిస్థితి విషమం

ముస్తఫా అల్ కదిమి నివాసం.. ప్రభుత్వ భవనాలు, విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న బాగ్దాద్‌లో పటిష్టమైన భద్రత కలిగిన గ్రీన్ జోన్‌లో ఉంది. అలాంటి చోట ఈ రకమైన దాడులు జరగడం విదేశీ దౌత్యవేత్తలను కూడా ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు. 

Also read: Afghanistan: సహాయక చర్యల్లోనూ మహిళలు వద్దు.. తాలిబాన్ దుష్ట నిర్ణయం

కదిమి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఇరాక్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సైన్యం ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు.. ప్రధాని క్షేమంగా ఉన్నారని, ప్రశాంతంగా ఉండాలని కదిమి అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ఈ దాడిలో కదిమి నివాసం వెలుపల  ఉన్న ఆయన వ్యక్తిగత రక్షణ సిబ్బందిలో ఆరుగురు గాయపడినట్టుగా సమాచారం. ఇక,  ఈ దాడిని యూనైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఖండించింది. దర్యాప్తులో సహాయం అందించేందుకు సిద్దమని వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios