ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఛాందసవాద నిర్ణయాలు దేశంలోని సమస్యలు మరింత పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళా హక్కులను కాలరాస్తున్నది. తాజాగా, సహాయక చర్యల్లోనూ మహిళలు పాల్గొనడానికి వీల్లేదనే ఆదేశాలను అమలు చేస్తున్నది. దేశంలోని 34 ప్రావిన్స్‌లలో మూడు మినహా అన్ని ప్రావిన్స్‌లలోనూ మహిళా ఎయిడ్ వర్కర్లపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. 

న్యూఢిల్లీ: Afghanistan పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి Talibans వచ్చినప్పటి నుంచి ఆ దేశం సంక్షోభం అంచులకు చేరుతున్నది. ఆర్థిక పతనంతోపాటు అనేక సమస్యలు చుట్టుముట్టుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కూలిపోయాక విదేశీ ఆర్థిక సహకారం సన్నగిల్లింది. దీనికతోడు తాలిబాన్ల ఛాందసత్వం కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నది. మహిళల హక్కులను కాలరాస్తూ వారి స్వేచ్ఛను ఖైదు చేసింది. యుద్ధంతో అల్లకల్లోలాన్ని చవిచూసిన ఆఫ్ఘనిస్తాన్‌లో సహాయక చర్యల్లోనూ పనిచేయడానికి ఆ దేశ Womenను తాలిబాన్లు అనుమతించడం లేదు. దీంతో సంక్షోభంలో కూరుకుపోయి సహకారం కోసం దీనంగా ఎదురుచూస్తున్న ప్రజలు ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు, మహిళా నేతృత్వంలోని కుటుంబాలు మరింత విషాదంలోకి జారిపోతున్నాయి.

తాలిబాన్లు తమ దేశంలో మహిళలకు ఎలాంటి Rights లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. కనీసం సహాయక చర్యల్లో పాల్గొనే వర్కర్లుగానూ ఆఫ్ఘనిస్తాన్ మహిళలను తాలిబాన్లు అనుమతించడం లేదు. దేశంలోని సమస్యలను పరోక్షంగా మరింత ఎగదోసేట్టు చేస్తున్నది.

Also Read: Afghanistan: తొమ్మిదేళ్ల కూతురిని అమ్మేసిన తండ్రి.. ‘బతకాలంటే తప్పట్లేదు’

తాలిబాన్ల నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారని మానవ హక్కుల సంస్థ హెచ్ఆర్‌డబ్ల్యూ‌లో మహిళా హక్కుల విభాగానికి డైరెక్టర్‌గానున్న హీదర్ బార్ అన్నారు. ప్రాణాలు రక్షించుకోవడానికి సహకారం కోసం ఎదురుచూస్తున్న వారికి సహాయం అందకుండా చేసినట్టువుతున్నదని తెలిపారు. తాలిబాన్లు మహిళా సహాయక వర్కర్లపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నదని తెలిపారు. సహాయం అందించే సంస్థలు, లేదా డోనర్లు కేవలం తమ హెల్ప్ అందాలనే యోచిస్తారని వివరించారు. ఆ పని ఎవరు చేస్తున్నారనేది వారికి అవసరం లేదని తెలిపారు. కానీ, ఆ సహకారం అవసరమున్న వారికి అందడం ముఖ్యమని టోలో న్యూస్‌కు చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో 34 ప్రావిన్స్‌లు ఉన్నాయి. ఇందులో కేవలం మూడు ప్రావిన్స్‌లు మాత్రమే అధికారికంగా మహిళలను సహాయక చర్యల్లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చాయి. మిగతా చోట్ల విమెన్ ఎయిడ్ వర్కర్‌లపై నిషేధాజ్ఞలు అమలు అవుతున్నాయి. హెచ్‌ఆర్‌డబ్ల్యూ సమీక్షించిన దస్తావేజుల ప్రకారం గత నెల 28వ తేదీ వరకు తాలిబాన్ అధికారులు కేవలం మూడు ప్రావిన్స్‌లలోనే మహిళలు బేషరతుగా ఎయిడ్ వర్కర్లుగా పనిచేయడానికి అనుమతులు ఇచ్చారు. రాతపూర్వకంగా ఈ అనుమతులు ఇచ్చారు. కానీ, మిగతా 31
ప్రావిన్స్‌లలో ఇలా బేషరతుగా అనుమతులు ఇవ్వలేదు. కాగా, దాదాపు సగం దేశంలో సహాయక చర్యలు చేసే మహిళా ఎయిడ్ వర్కర్లు ఆ పనులు చేయడానికి పురుషులు తోడుగా వెళ్లాలనే నిబంధనలున్నాయి. దీంతో సహాయక చర్యలు అవసరమైన వారికి చేరడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. పురుషుల తోడు తప్పనిసరి అనే నిబంధనతో ఈ సహాయక చర్యలు ప్రభావవంతంగా చేరడం లేదు అని టోలో న్యూస్ ఓ రిపోర్టులో పేర్కొంది.

Also Read: Taliban: ‘పెళ్లి విందులో మ్యూజిక్ ఆపడానికి 13 మందిని కాల్చి చంపారు’

యుద్ధాలతో ఛిద్రమైన Afghanistan ఆర్థిక వ్యవస్థ పతన దశకు చేరింది. నగదు చలామణి తగ్గిపోయింది. బ్యాంకుల్లోనూ నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ పౌరులూ డబ్బు లేక రోజువారీ జీవనం గడపడానికి విలవిల్లాడుతున్నారు. Taliban ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హక్కుల కోసం నిరసనలు పెద్దపెట్టున జరిగాయి. ఇప్పుడు ఆర్థిక సమస్యలపైనా ఆందోళనలు మొదలయ్యాయి.