ఇరాక్ లో భారీ పేలుడు... 16మంది మృతి

Iraq: At least 16 dead as arms depot blows up in Baghdad
Highlights

పలువురికి గాయాలు

ఇరాక్ లోని సదర్ సిటీలో  భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. సదార్‌ సిటీలోని ఆయుధ భాండాగారంలో ఈ పేలుడు సంభవించినట్లు భద్రతా, వైద్య సిబ్బంది వెల్లడించారు. మసీదు సమీపంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారని, పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉందని బాగ్దాద్‌ సెక్యురిటీ ఆపరేషన్స్‌ కమాండ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. పేలుడు కారణంగా 16 మంది మరణించగా, 32 మంది గాయపడినట్లు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఇళ్లు, భవనాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

loader